Boy complained to police on mother : ‘అన్నం పెట్టమని అడిగితే అమ్మ కొడుతోంది సార్’ అంటూ 8 ఏళ్ల పిల్లాడు పోలీసులకు ఫిర్యాదు

‘అన్నం పెట్టమని అడిగితే అమ్మ కొడుతోంది సార్’ అంటూ ఎనిమిదేళ్ల పిల్లాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ పిల్లాడి ఫిర్యాదు విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు.

8 Year old Boy complained to police on mother : బిడ్డకు ఆకలి అవకుండానే అన్నంపెట్టి కడుపు నింపుతుంది అమ్మ. అమ్మా ఆకలేస్తోందే అని అడిగితే తల్లడిల్లిపోతుంది..అటువంటి అమ్మ బిడ్డ అన్నం పెట్టమని అడిగితే పెట్టకుండా ఉంటుందా? ఉండగలుగుతుందా? కానీ ఓ అమ్మ మాత్రం బిడ్డకు అన్నం పెట్టలేదట. పోనీ అమ్మ పెట్టలేదు కదా..కంచంలో అన్నం పెట్టుకుని తింటున్న బిడ్డను ఓ కన్నతల్లి కొట్టిదట. ఆ అన్నం కంచాన్ని విసిరిపారేసిదట..బీహార్ లో ఓ ఎనిమిదేళ్ల పిల్లాడు ఏడుస్తూ వచ్చి తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మా అమ్మ అన్నం పెట్టంలేదు సార్ అన్నం పెట్టమని అడిగితే కొడుతోంది సార్ అంటూ  ఆపిల్లాడు చెప్పింది విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు.

బిహార్‌ లోని సీతామఢీలోని చంద్రిక మార్కెట్‌ వీధిలో సిటీ పోలీసుల వద్దకు ఎనిమిదేళ్ల పిల్లాడు వచ్చాడు. ఏడుస్తూ.. ‘సార్..మా అమ్మ నాకు అన్నం పెట్టటంలేదు..అన్నం అడిగితే అమ్మ కొడుతోంది. ఒక్కోసారి నేను తింటుంటే పళ్లెం లాక్కొని విసిరేస్తుంది సార్‌’ అంటూ తల్లిపై ఫిర్యాదు చేశాడు. పోలీస్‌స్టేషనుకు వచ్చిన ఆ 8 ఏళ్ల బాలుడిని చూసి బిహార్‌ పోలీసులు ఆశ్చర్యపోయారు. ఏడుస్తూ అమ్మ అన్నం పెట్టంలేదు సార్ అని ఆ పిల్లాడు చెబుతుంటే విన్న పోలీసులకు ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు. క్షణాల్లో తేరుకుని ‘ఆకలేస్తోందా? అని అడిగి గబగబా అన్నం తెప్పించి కడుపు నిండా పెట్టారు. తరువాత వివరాలు అడిగారు..మీరు ఎక్కడుంటారు? మీ అమ్మా నాన్నలు ఏం చేస్తుంటారు? అని అడిగారు. తను నాలుగో తరగతి చదువుతున్నానని చెప్పుకొచ్చాడా పిల్లాడు.

అలా ఆ పిల్లాడు చెప్పిన వివరాలు విన్న పోలీసులు ఆ బాలుణ్ని ఇంటికి తీసుకువెళ్లారు. తల్లిని విచారించారు. దాంతో సదరు పిల్లాడు తల్లి అలాంటిదేమీ లేదు సార్..ఒక్కోసారి అల్లరి చేస్తే తిడుతున్నానని..అంతకంటే ఏమి లేదని అని చెప్పింది. దీంతో పిల్లాడిని కొట్టవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఆ పిల్లాడికి జాగ్రత్తలు చెప్పి పోలీసులు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని పోలీసు అధికారి రాకేశ్‌ కుమార్‌ తెలిపారు. ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ట్రెండింగ్ వార్తలు