Gujarat: గత 24 గంటల్లో గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని నగరాలు, గ్రామాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. చాలా ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. అయితే ఈ అధిక వర్షాపాతం కారణంగా రాష్ట్రంలో 9 మంది మృతి చెందినట్లు శనివారం గుజరాత్ ప్రభుత్వ యంత్రాంతం అధికారికంగా ప్రకటించింది. ఇక చాలా ప్రాంతాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కూడా వారు వెల్లడించారు.
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం సహా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు కచ్, జామ్‌నగర్, జునాగఢ్, నవ్‌సారి తీవ్రంగా ప్రభావితమైన జిల్లాలలో కొన్నింటిని మోహరించి సహాయక చర్యలు చేస్తున్నట్లు అధికారి తెలిపారు. రాష్ట్రంలోని 37 తాలూకాల్లో 30 గంటల పాటు 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందట. శుక్రవారం అర్థరాత్రి మొదలైన వర్షం.. శనివారం ఉదయం 6 గంటలకు ముగిసింది. జునాగఢ్ జిల్లాలోని విసావదర్ తాలూకాలో అత్యధికంగా 398 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.
Siddipeta : ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపేశాడని.. లైన్ మెన్ పై పెట్రోల్ పోసి హత్యాయత్నం
అధిక వర్షపాతం కారణంగా.. జామ్‌నగర్ జిల్లాలోని జామ్‌నగర్ తాలూకా (269 మిమీ), వల్సాద్‌లోని కప్రద (247 మిమీ), కచ్‌లోని అంజర్ (239 మిమీ), నవ్‌సారిలోని ఖేర్గామ్ (222 మిమీ) ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌరాష్ట్ర-కచ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని అనేక జిల్లాల్లోని ప్రాంతాల్లో చాలా భారీ వర్షాలు కురిశాయి. దీనివల్ల లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచి గ్రామాలు మునిగిపోయాయి. అహ్మదాబాద్ నగరంలోని అనేక ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. దీంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.
Manipur Violence: రాహుల్ గాంధీ ‘మణిపూర్’ పర్యటనపై పొగడ్తలు కురిపించిన బీజేపీ చీఫ్
కచ్ జిల్లాలో భారీ వర్షం కురవడంతో గాంధీధామ్ రైల్వే స్టేషన్ జలమయమైంది. జునాగఢ్, జామ్‌నగర్, కచ్, వల్సాద్, నవ్‌సారి, మెహసానా, సూరత్‌లలో పలు గ్రామాలు, పట్టణాలు జలమయమయ్యాయని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శుక్రవారం రాత్రి గాంధీనగర్‌లోని ఎస్‌ఇఓసీలో అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయడంతో సహా రెస్క్యూ, రిలీఫ్ పనులపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.