Siddipeta : ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపేశాడని.. లైన్ మెన్ పై పెట్రోల్ పోసి హత్యాయత్నం
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ కు చెందిన ఓ ఇంటి యజమాని కరుణాకర్ విత్యుత్ బిల్లు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో లైన్ మెన్ నరేష్.. కరుణాకర్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడు.

Man Attempt to kill
Man Attempt To Kill Lineman : సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. విద్యుత్ సరఫరా నిలిపి వేశాడని లైన్ మెన్ పై ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడని ఇంటి యజమాని లైన్ మెన్ పై పెట్రోల్ పోసి, నిప్పంటించి చంపేందుకు ప్రయత్నించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ కు చెందిన ఓ ఇంటి యజమాని కరుణాకర్ విత్యుత్ బిల్లు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో లైన్ మెన్ నరేష్.. కరుణాకర్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. దీంతో ఆగ్రహించిన కరుణాకర్.. లైన్ మెన్ నరేష్ తో వాగ్వాదానికి దిగాడు.
CPI Narayana : మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే కామన్ సివిల్ కోడ్ తెరపైకి : నారాయణ
అంతేకాకుండా లైన్ మెన్ పై పెట్రోల్ పోసి, నిప్పంటించే ప్రయత్నం చేశాడు. అయితే, కరుణాకర్ భార్య అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. లైన్ మెన్ నరేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.