Madhya Pradesh cops
crowded tea stall : కరోనా కేసులు ఎక్కువవుతున్న క్రమంలో..తెరిచి ఉంచి ఉన్న టీ స్టాల్ ను బంద్ చేయాలని చెప్పిన పోలీసులపై మరుగుతున్న టీ పోశాడు. అంతేగాకుండా..అతని కుటుంబసభ్యులు దాడి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు అధికమౌతుండడంతో కఠిన ఆంక్షలు విధించింది ప్రభుత్వం. రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నారు. Qazi Camp ప్రాంతంలో రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించారు. అయితే..ఈ ప్రాంతంలో జహీర్ ఖాన్ అనే వ్యక్తి రాత్రి సమయంలో టీ షాపు తెరిచి ఉంచుతున్నాడని సమాచారం వచ్చింది. దీంతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వినియోగదారులు వస్తున్నారని, హోటల్ బంద్ చేయాలని పోలీసులు సూచించారు.
దుకాణం షట్టర్ కొద్దిగా దింపాడు. కొద్దిసేపటి తర్వాత..తిరిగి దుకాణం తెరిచాడు. దీనిని గమనించిన పోలీసులు…అక్కడకు చేరుకున్నారు. హోటల్ బంద్ చేయాలని చెప్పారు. జహీర్ ఖాన్ ఆ పోలీసులపై మరుగుతున్న టీ పోశాడు. అనంతరం అతని కుటుంబసభ్యులు పోలీసులపై ఇటుకలతో దాడికి పాల్పడ్డారు. ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జహీర్ ఖాన్ తో పాటు మరో 8 మందిని అరెస్టు చేశారు.
Read More : Coronavirus update AP : వామ్మో కరోనా..ఏపీలో 24 గంటల్లో 1326 కేసులు