Black Cobras : మట్టి కుండలో బయటపడ్డ 90 నాగుపాములు

ఉత్తరప్రదేశ్ లోని ఒకఇంట్లో 90 నల్లనాగుపాములు బయటపడ్డాయి. ఇంట్లోని పాతమట్టికుండను తెరిచి చూడగా ఇవి కనిపించాయి.

Black Cobras

Black Cobras :  ఉత్తరప్రదేశ్ లోని ఒకఇంట్లో 90 నల్లనాగుపాములు బయటపడ్డాయి. ఇంట్లోని పాతమట్టికుండను తెరిచి చూడగా ఇవి కనిపించాయి. అంబేద్కర్ నగర్ జిల్లాలోని అలపూర్ తహసీల్ పరిధిలోని మదువానా గ్రామంలో ఈ నాగు పాములు వెలుగు చూశాయి.

గ్రామంలోని ఒక వ్యక్త తన ఇంటిలోని పాత మట్టి కుండను తెరిచిచూడగా పాములు కనపడ్డాయి. దీంతో షాక్ కు గురైన ఆ వ్యక్తి వెంటనేగ్రామస్తులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అవి సుమారుగా 90 వరకు ఉంటాయని కుటుంబ సభ్యులు తెలిపారు. పాములను చూడటానికి గ్రామస్తులు భారీగా తరలి వచ్చారు.

అటవీశాఖ అధికారులు నల్ల నాగు పాములను పట్టుకుని అడవి లో వదిలేశారు. పాములను చూసి ఎవరూ భయపడవద్దని వారు గ్రామస్తులకు సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఒక నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.