920 Deaths In Maharashtra Highest Ever In A Day 57640 New Cases
Maharashtra మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ..మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. గడిచిన 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 920 మంది కరోనాతో కన్నుమూశారని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించింది. రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కోవిడ్ మరణాల్లో ఇదే అత్యధికమని తెలిపింది. అదేసమయంలో 57,000కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది.
ఒక్క ముంబై సిటీలోనే గత 24గంటల్లో… 3882కొత్త కేసులు,77మరణాలు నమోదుకాగా,పూణేలో9,084కేసులు,93మరణాలు నమోదయ్యాయని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6.41లక్షల కరోనా యాక్టివ్ కేసులున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు.