earthquake
earthquake : జమ్మూకశ్మీర్ లో భూకంపం సంభవించింది. కత్రాలో శుక్రవారం ఉదయం 5.01 గంటలకు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కత్రాకు 97 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైంది.