Tamil Nadu: హిజాబ్‌‌లో వచ్చిందని మహిళను ఓటెయ్యనివ్వని బీజేపీ ఏజెంట్!

తమిళనాడులో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. 21 కార్పొరేషన్లు, 138 మున్సిపాలిటీలు, 490 పంచాయతీల్లో ఒకే దశలో ఈరోజు(19 ఫిబ్రవరి 2022) పోలింగ్‌ జరుగుతుంది.

Hizab

Tamil Nadu Urban Local Body Poll: దాదాపు 11 ఏళ్ల తర్వాత తమిళనాడులో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. 21 కార్పొరేషన్లు, 138 మున్సిపాలిటీలు, 490 పంచాయతీల్లో ఒకే దశలో ఈరోజు(19 ఫిబ్రవరి 2022) పోలింగ్‌ జరుగుతోంది. 12,607 స్థానాలకు 57వేల 778 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 22వ తేదీన ఓట్ల లెక్కింపు ఉండగా.. మార్చి 2న కొత్త సభ్యులు బాధ్యతలు స్వీకరించనున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నైలో ఓటు వేశారు. మొత్తం 31వేల పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ సాగుతోంది. చివరి గంట సమయం కరోనా వైరస్ బారిన పడిన ప్రజలు ఓటు వేయడానికి రిజర్వ్ చేశారు. అధికార డీఎంకే, దాని మిత్రపక్షాలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే, మదురైలోని పోలింగ్ బూత్‌కు హిజాబ్ ధరించి వచ్చిన మహిళా ఓటరుని ఓటు వెయ్యడానికి వీల్లేదంటూ బీజేపీ బూత్ కమిటీ సభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. హిజాబ్ తీస్తేనే ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని, హిజాబ్ తీయమంటూ గొడవ చేశాడు. డీఎంకే, ఏఐఏడీఎంకే సభ్యులు బీజేపీ సభ్యునిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అతన్ని బూత్‌లో నుంచి బయటకుల పంపించారు.


అయితే, బీజేపీ వ్యక్తి ప్రవర్తనపై DMK, AIADMK సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. బీజేపీ ఎప్పటి నుంచో ఇదేపని చేస్తుందని, మేం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ప్రజలకు కూడా ఎవరిని ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరిని తిరస్కరించాలో తెలుసునని తమిళనాడు ప్రజలు ఇటువంటివి ఎప్పటికీ అంగీకరించరని అన్నారు.