Viral Video : నదిలోకి దూసుకెళ్లిన కారు.. వీడియో

వంతెన దాటుతున్న సమయంలో కారు అదుపుతప్పి నదిలోపడిపోయింది. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video : సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో కొన్ని బాధ కలిగించేవి ఉంటే మరికొన్ని ఫన్నీ వీడియోలు ఉంటాయి. కానీ కొన్ని వీడియోలు బాధతోపాటు ఆనందం కూడా పంచుతాయి. తాజాగా జరిగిన ఘటన ఇటువంటిదే.. ఓ వ్యక్తి కారులో వంతెన దాటుతున్నాడు. అదే వంతెనపై ఎదురుగా ముగ్గురు వ్యక్తులు వస్తున్నారు.

ఇరుకుగా ఉన్న వంతెనపైకి కారు రాగానే ఒక్కసారిగా స్టీరింగ్ పక్కకు తిప్పాడు. దీంతో కారు నదిలో పడిపోయింది. ఊహించని ఈ ప్రమాదంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. అయితే నదిలో నీరు తక్కువగా ఉండటంతో కారు పైకి తేలింది. దీంతో డ్రైవర్ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ వీడియో చూడడానికి ప్రమాదంలా ఉన్నా.. దీనిని చూసినా వారు ఫన్నీ వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది వినోదం పంచె ప్రమాదమని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షేర్ చేసిన ఐదు రోజుల్లోనే 31 లక్షలమంది దీనిని వీక్షించారు.

ట్రెండింగ్ వార్తలు