Nitish Kumar On BJP, RSS: స్వాతంత్ర్య పోరాట చరిత్రను బీజేపీ, ఆర్ఎస్ఎస్ తిగరరాస్తాయి.. గాంధీజీ పేరును పక్కనపెట్టేస్తాయి: నితీశ్

‘‘75 ఏళ్ళ స్వాతంత్ర్య భారత ఉత్సవాలకు వారు ఏ పేరు పెట్టారు? ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అంటూ వేడకలు నిర్వహిస్తున్నారు. అమృత్ ఏంటీ? స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకుడు ఎవరు? మహాత్మా గాంధీ. ఈ ఉత్సవాలకు బాపూ మహోత్సవ్ అని పేరు పెట్టాల్సింది’’ అని నితీశ్ కుమార్ అన్నారు.

Nitish Kumar On bjp, rss: ఢిల్లీలో పర్యటిస్తోన్న బిహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అవకాశం వస్తే స్వాతంత్ర్య పోరాట ఉద్యమ చరిత్రను బీజేపీ, ఆర్ఎస్ఎస్ తిగరరాస్తాయని చెప్పారు. ఆ చరిత్రలో మహాత్మా గాంధీని పూర్తిగా పక్కనపెట్టేస్తారని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదని చెప్పారు. ‘‘75 ఏళ్ళ స్వాతంత్ర్య భారత ఉత్సవాలకు వారు ఏ పేరు పెట్టారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అంటూ వేడకలు నిర్వహిస్తున్నారు. అమృత్ ఏంటీ? స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకుడు ఎవరు? మహాత్మా గాంధీ. ఈ ఉత్సవాలకు బాపూ మహోత్సవ్ అని పేరు పెట్టాల్సింది’’ అని నితీశ్ కుమార్ అన్నారు.

కాగా, 2024 లోక్‌సభ ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా ఇవాళ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో నితీశ్ కుమార్ సమావేశమైన విషయం తెలిసిందే. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, జేడీయూ నేత సంజయ్ ఝా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజాతోనూ నితీశ్ కుమార్ చర్చలు జరిపారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలకు బీజేపీకి వ్యతిరేకంగా ఏకం చేయడమే తమ లక్ష్యమని ఆయన అంటున్నారు.

Strict lockdown in China: భూకంపంతో 65 మంది చనిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా.. కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తోన్న చైనా

ట్రెండింగ్ వార్తలు