ఈ విద్యార్థి గుండె గూటిలో ఎవరెవరు ఉన్నారో చూడండి..

Viral Pic: హరిత, ప్రియ, పూజ, రూప, నమిత అనే అమ్మాయిల గురించి..

ఈ విద్యార్థి గుండె గూటిలో ఎవరెవరు ఉన్నారో చూడండి..

మానవ హృదయం నాలుగు గదులతో నిర్మితమై ఉంటుందని చదువుకున్న వారందరికీ తెలుసు. పై భాగాన ఉండే రెండు గదులను కర్ణికలు అని, కింది భాగాన ఉండే వాటిని జఠరికలు అని పిలుస్తారు. ఇదే విషయంపై పాఠశాల విద్యార్థులకు చిత్రాలు గీసుకు రావాలని జీవశాస్త్ర ఉపాధ్యాయులు చెబుతుంటారు. గుండె గదుల గురించి వివరించాలని కూడా హోం వర్క్ ఇస్తుంటారు.

అలా చెప్పడంతోనే ఓ విద్యార్థి గుండె చిత్రాన్ని గీశాడు. అయితే, అందులోని భాగాల పేర్లను మాత్రం సరికొత్తగా రాయడంతో ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. గుండె గదుల పేర్లను హరిత, ప్రియ, పూజ, రూప, నమిత అనే అమ్మాయిల పేర్లను రాశాడు.

గుండె గదులు, అవి చేసే పనుల గురించి వివరించినట్లు.. ఈ విద్యార్థి హరిత, ప్రియ, పూజ, రూప, నమిత అనే అమ్మాయిల గురించి కూడా వివరించి రాశాడు. హరిత ఇన్‌స్టాలో తనతో చాటింగ్ చేస్తుందని, రూప తనతో స్నాప్ చాట్ లో చాటింగ్ చేస్తుందని ఆమె క్యూట్ గర్ల్ అని చెప్పాడు. తన నమిత తమ పొరుగింట్లో ఉంటుందని, పూజా తన ప్రేయసి అని, హరిత క్లాస్‌మేట్ అని రాసుకొచ్చాడు.

 

View this post on Instagram

 

A post shared by _MEMES_CONNECTION (@_memes_connection)

కష్టాన్ని నమ్ముకుని బతికే ఇతడి వీడియోలు వైరల్ కావడంతో బలవన్మరణానికి పాల్పడిన వైనం