SNAKE
Man Fired Cobra : ఓ వ్యక్తి గన్ తో నాగు పాముపై కాల్పులు జరిపాడు. ఆగ్రహించిన ఆ పాము ఏం చేసిందో చూస్తే భయపడాల్సిందే. ఒక వ్యక్తి కారులో వెళ్తుండగా కచ్చా రోడ్డుపై ఒక నాగు పాము కనిపించింది. దీంతో అతడు తన వాహనాన్ని ఆపాడు. ఆ పామును కవ్విచేందుకు ప్రయత్నించాడు. అంతేకాకుండా తన దగ్గర ఉన్న రివాల్వర్ తో పాముపైకి మొదట ఒక రౌండ్ కాల్పులు జరిపాడు.
గురి తప్పడంతో మరో బుల్లెట్ ను దగ్గర నుంచి ఫైర్ చేశాడు. దీంతో ఆగ్రహించిన పాము ముందుకు పాకుతూ కాటు వేసేందుకు వేగంగా అతని వైపుకు దూసుకొచ్చింది. ఇన్ స్టెంట్ కర్మ అన్న యూజర్ ఈ వీడియో క్లిప్ ను ట్విట్టర్ లో పోస్టు చేశారు. నాగు పాముతో పోరాటానికి గన్ తీసుకురావద్దు అని శీర్షిక పెట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Cobra In Shoe : షూలో దాగిన నాగు పాము.. పడగవిప్పి బుసలు కొట్టిన స్నేక్
ఈ వీడియోను 2 లక్షల మంది వీక్షించారు. నెటిజన్లు కూడా ఘాటుగా, ఫన్నీగా కామెంట్లు చేశారు.
ఆ పాము డేర్ డెవిల్ అని ఒకరు, మూడో షాట్ కాల్పులకు అది అవకాశం ఇవ్వలేదని మరొకరు వ్యాఖ్యానించారు. అయితే గున్ తో పాముపై కాల్పులు జరపడం పలువురు విమర్శించారు. వినోదం కోసం తుపాకీతో కాల్చి పామును చంపేందుకు ప్రయత్నించడంపై మండిపడ్డారు.
Don’t bring a gun to a cobra fight! ? pic.twitter.com/qGshAWdjHu
— Instant Karma (@Instantregretss) December 16, 2022