ఆగస్టు లాస్ట్ వీక్ లో..ప్రధాని మోడీ కోసం అత్యాధునిక క్షిపణీ B-777 విమానం

  • Publish Date - August 22, 2020 / 12:39 PM IST

అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎలా ఉంటుంది. అలాంటివే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిలు ఉపయోగించనున్నారు. ప్రత్యేక బోయింగ్ 777-300ER VVIP విమానాలను క్షిపణి దుర్భేద్యంగా రూపకల్పన చేశారు. ఈ విమానాలు ఆగస్టు చివరి వారంలో రానున్నాయి.



వాస్తవానికి ఈ విమానాలు జూన్ నాటికే అందించాల్సి ఉన్నా..కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో..తయారీలో ఆలస్యం ఏర్పడుతోంది. రూ. 8,458 కోట్లు అంచనా వ్యయంతో తయారవుతున్నట్లు సమాచారం. విమానాల్లో ఉండే మిసైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ (ఎండీఎస్‌) ఖరీదే సుమారు రూ. 1,435.19 కోట్లుగా ఉందని అంచనా. నిజానికి ఈ విమానాల్ని జూన్ నాటికే అందించాల్సి ఉంది.

2018లో ఇలాంటి విమానాల్ని బోయింగ్ సంస్థ భారతదేశానికి అప్పగించింది. కానీ వీటిని ఇండియా తిరిగి ఇచ్చేసింది. VVIP ట్రావెల్‌కి తగినట్లుగా విమానాల్ని సిద్ధం చేయమని సూచించడంతో…అత్యాధునిక టెక్నాలజీ వాడుతూ..విమానాలను తయారు చేశారు.



ఇండియాకి అప్పగించిన తర్వాత వాటిపై ఉన్న రిజిస్ట్రేషన్‌ను తొలగిస్తారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ (IAF)కి అప్పగించి… మళ్లీ రిజిస్టర్ చేయిస్తారు. తద్వారా అవి ఎయిర్‌ఫోర్స్ విమానాలుగా రికార్డుల్లో ఉంటాయి.

ప్రత్యేకతలు : –
ముందు భాగంలో పైన శక్తిమంతమైన EW జామర్‌ ఉంటుంది. మూడు చోట్ల యూహెచ్‌ఎఫ్ / వీహెచ్‌ఎఫ్‌ ఏంటినాలు ఉంటాయి. రెక్కలకు ముందు భాగంలో ‘మిర్రర్‌ ల్‌ ఈక్వలెంట్‌ సిస్టం’ను అమరుస్తారు. తోక భాగంలో క్షిపణి హెచ్చరిక వ్యవస్థ, డైరెక్షనల్‌ ఇన్‌ఫ్రారెడ్‌ కౌంటర్‌ మెజర్‌ సిస్టం (డీఐఆర్‌సీఎం) నిరంతరం నిఘా పెడతాయి.



ఈ విమానాల్లో హై-సెక్యూరిటీ సెటప్ ఉంటుంది. ఇండియాలో తయారు చేసిన లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రారెడ్ కౌంటర్‌మెజర్స్ (LAIRCM) విధానం, సెల్ఫ్-ప్రొటెక్షన్ సూట్లు ఉంటాయి. మూడేళ్ల క్రితం కొనుగోలు చేసిన రెండు బోయింగ్‌ 777 ఈఆర్ ‌విమానాలకు అమెరికా సహకారంతో అత్యంత పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.