Cyclone Asani: బలపడిన వాయుగుండం.. నేడు తుపానుగా మారే చాన్స్

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈరోజు అది తుపానుగా మారుతుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Cyclone Asani: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈరోజు అది తుపానుగా మారుతుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఇది మరింత వాయువ్యంగా ప్రయాణించి సోమవారం ఉదయానికి కోస్తాంధ్ర-ఒడిశా తీరాలకు దగ్గరగా వస్తుందని స్పష్టం చేసింది. ఈ నెల 10వ తేదీ నాటికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం ఇది దిశమార్చుకుని ఈశాన్యం వైపు వెళ్లేందుకు అవకాశముందని ఐఎండీ తెలిపింది.

Cyclone Asani: ముంచుకొస్తున్న ‘అసని’: తూర్పు తీరానికి తీవ్ర తుఫాను హెచ్చరిక

దీని ప్రభావంతో ఈ నెల 9 నుంచి.. ఏపీలోని తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలతోపాటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఈదురుగాలులు, సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశముందని.. మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ ఇప్పటికే జారీచేసింది.

Cyclone: బంగాళాఖాతంలో వాయుగుండం.. తుపానుగా మారే అవకాశం

వాయుగుండం, తుపాను ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. వర్షాల కారణంగా రైతులు తమ ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా.. ఇప్పటికే గత వారం తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల కురిసిన భారీ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు తుపాను ప్రభావంపై ఆందోళన చెందుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు