Viral Video : డబ్బులు చెట్లకు కాస్తాయా? ఈ వీడియో చూస్తే నిజమే అనిపిస్తుంది.. కానీ!

సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫేర్ వీడియోస్ ఉంటే, మరికొన్ని మాత్రం ఫేక్ వీడియోస్ ఉంటాయి.

Viral Video :  సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫేర్ వీడియోస్ ఉంటే, మరికొన్ని మాత్రం ఫేక్ వీడియోస్ ఉంటాయి. ఫేమస్ అయేందుకు చాలామంది ఫేక్ వీడియోస్ చేస్తుంటారు. ఆలా అయితే ప్రజలకు దగ్గరవ్వచ్చన్నది వారి ఉద్దేశం. కానీ కొన్ని సార్లు ఫేక్ వీడియోస్ కూడా అచ్చం నిజమైన వీడియోస్ లాగానే కనిపిస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో కూడా నిజం లాగే అనిపిస్తుంది.. కానీ అది ఫేక్ వీడియో.. ఆ వీడియో ఏంటో ఇప్పుడు చూద్దాం.

చదవండి : Viral Video: ఈ కేక్‌ కట్ చేసే ధైర్యముందా?ఎటాక్ చేస్తుందేమో జాగ్రత్త..!

ఓ వ్యక్తి తన పెరట్లో క్యాప్పికం మొక్కలు నాటాడు. కాయలు కోతదశకు వచ్చాయి. ఇదే సమయంలో అతడు తన తోటలోకి వెళ్లి క్యాప్పికంను కట్ చేస్తే అందులోంచి రూపాయి కాయిన్స్ తీశాడు. క్యాప్పికంలోంచి రూపాయి కాయిన్స్ వస్తున్నట్లుగానే ఉంది. కానీ అది ఫేక్..అతడు ముందుగానే ప్లాన్ ప్రకారం క్యాప్పికంలోకి రూపాయి కాయిన్స్ పెట్టాడు. అనంతరం గమ్ తో అతికించాడు. ఆ తర్వాత క్యాప్పికంను చీల్చి చూపించాడు. సహజంగా చెట్లకు డబ్బులు కాయవని మనందరికీ తెలిసిందే!! ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భిన్న స్పందన వస్తోంది.

చదవండి : Police Constable Video Viral  : పట్టపగలు పోలీసు గ్రౌండ్‌లో మద్యం సేవించిన పోలీసు వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు