ఆధార్ కార్డు పోయిందా.. సెంటర్ కి వెళ్లకుండానే కొత్తది పొందండిలా

  • Published By: veegamteam ,Published On : December 14, 2019 / 01:42 AM IST
ఆధార్ కార్డు పోయిందా.. సెంటర్ కి వెళ్లకుండానే కొత్తది పొందండిలా

Updated On : December 14, 2019 / 1:42 AM IST

ప్రస్తుతం కీలకమైన ధ్రువీకరణ పత్రాల్లో ఆధార్ కార్డు కూడా ఒకటి. మనం ఏ పని చేయలన్న ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. అయితే కొన్ని సందర్భాల్లో ఆధార్ ఎక్కడైనా పోవచ్చు. అలాంటి సమయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ఆధార్ కార్డును తిరిగి పొందొచ్చు. 

అంతేకాదు ఆధార్ కోసం మీరు ప్రత్యేకంగా సెంటర్‌ కు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో కూర్చుని పని పూర్తి చేసుకోవచ్చు. యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) రీసెంట్ గా mAadhaar యాప్ ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా మీరు కొత్త ఆధార్ ను పొందవచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌ కు వెళ్లి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ తో ఎన్నో రకాల సేవలు పొందొచ్చు. 

ఈ యాప్ తెలుగు సహా 13 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ యాప్ లో ఆధార్ రిప్రింట్ కోసం కూడా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఇందుకు రూ.50 చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు కొత్త ఆధార్ కార్డు 15 రోజుల్లోగా మీ ఇంటికి వచ్చేస్తుంది. ఇకపోతే mAadhaar యాప్‌లో ప్రధానంగా ఆధార్ సర్వీసెస్ డ్యాష్‌ బోర్డు, మై ఆధార్ అనే రెండు సెక్షన్లు ఉంటాయి.