Shraddha Walkar Case: చెఫ్‌గా ఉన్న అనుభవంతోనే శ్రద్ధను హత్య చేసిన అఫ్తాబ్.. కోర్టులో వెల్లడించిన పోలీసులు

గత ఏడాది అఫ్తాబ్ పూనావాలా తన ప్రేయసి శ్రద్ధాను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని 35 భాగాలుగా నరికి, మూడు వారాలపాటు తన ఇంట్లోని ఫ్రిజ్‌లో దాచి ఉంచాడు. ఈ క్రమంలో ఒక్కో శరీర భాగాన్ని ఢిల్లీలోని ఒక్కో చోట పాడేస్తూ వచ్చాడు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.

Shraddha Walkar Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. నిందితుడు ఆఫ్తాబ్ తనకు చెఫ్‌గా ఉన్న అనుభవంతోనే శ్రద్ధను హత్య చేసినట్లు ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. గత ఏడాది అఫ్తాబ్ పూనావాలా తన ప్రేయసి శ్రద్ధాను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవడం అసాధ్యం.. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా: ఎమ్మెల్సీ కవిత

హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని 35 భాగాలుగా నరికి, మూడు వారాలపాటు తన ఇంట్లోని ఫ్రిజ్‌లో దాచి ఉంచాడు. ఈ క్రమంలో ఒక్కో శరీర భాగాన్ని ఢిల్లీలోని ఒక్కో చోట పాడేస్తూ వచ్చాడు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. దీనిపై పోలీసులు విచారణ జరిపి నిందితుడు ఆఫ్తాబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గత నవంబర్ నుంచి ఆఫ్తాబ్ పూనావాలా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. గత ఫిబ్రవరి 7న ఈ కేసులో 6,629 పేజీల చార్జిషీటును పోలీసులు దాఖలు చేశారు. అనంతరం ఫిబ్రవరి 21న ఢిల్లీ కోర్టు దీనిపై విచారణ జరిపింది.

International Women’s Day: మహిళల గౌరవార్థం ప్రత్యేక డూడుల్ రూపొందించిన గూగుల్

ఈ సందర్భంగా పోలీసులు ఆఫ్తాబ్‌కు సంబంధించి కీలక విషయాలు కోర్టుకు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆఫ్తాబ్ చెఫ్‌గా పని చేసేవాడు. చెఫ్‌గా పని చేయడం వల్ల అతడికి ఏ కత్తి ఎలా వాడాలో తెలుసు. మాంసాన్ని ఎలా కట్ చేయాలో తెలుసు. అలాగే మాంసం కుళ్లిపోకుండా, ఫ్రిజ్‌లో ఎలా దాచి ఉంచాలో కూడా ఆఫ్తాబ్‌కు తెలుసు. తనకున్న అనుభవంతోనే ఆఫ్తాబ్ హత్య చేసి, ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో అతడే దోషి అని తేల్చేందుకు తగ్గ అన్ని శాస్త్రీయ, హేతుబద్ధ ఆధారాలు ఉన్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 20కి వాయిదా పడింది.