Delhi AAP : ఒకే ఒక్కడు సీన్.. మురికి కాల్వలోకి దిగిన ఆప్ కౌన్సిలర్, తర్వాత
ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో... మూడు స్థానిక సంస్థల విలీనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్...

Delhi Aap
AAP Councillor In Delhi : ఒకే ఒక్కడు సినిమా మీకు గుర్తుండే ఉంటుంది కదా. అందులో ఒక సీన్..ప్రేక్షకులను కళ్లార్పకుండా చేస్తుంది. మురికి గుంటలో హీరో.. విలన్లతో తలపడుతుంటాడు. అనంతరం హీరోకు అక్కడున్న వారు పాలాభిషేకం చేస్తారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. మురికి కాల్వను శుభ్రం చేయడానికి దిగిన ఆప్ పార్టీకి చెందిన కౌన్సిలర్ ను అభిమానులు పాలతో కడిగారు. దీనికి సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదంతా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు ఆ కౌన్సిలర్ వ్యవహరించారు.
ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో… మూడు స్థానిక సంస్థల విలీనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ బిల్లును ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లు తీసుకరావడంపై ఆప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో.. తూర్పు ఢిల్లీకి చెందిన ఆప్ కౌన్సిలర్ హసీబ్ ఉల్ హసన్.. శాస్త్రి నగర్ పార్క్ వద్దకు చేరుకున్నారు. అక్కడున్న మురుగు కాల్వను శుభ్రం చేసేందుకు దిగారు. అందులో ఉన్న చెత్తను తొలగించారు. పైన ఉన్న వారు తొలగించేందుకు అవసరమైన సామాగ్రీని అందించారు. మురికిని తొలగించడంతో ఆయన దుస్తులు మొత్తం పాడై పోయాయి. అనంతరం పైకి వచ్చిన తర్వాత.. అక్కడున్న మద్దతుదారులు ఆయన్ను కూర్చిపై కూర్చొబెట్టి పాలతో స్నానం చేయించారు. పాలు పైనుంచి పోస్తుండగా.. మురికిని కొంతమంది తొలగించారు.