CM Kejriwal : ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాం : సీఎం అర‌వింద్ కేజ్రీవాల్

ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీజేపీ విజయం సాధిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం అంటూ ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

CM Kejriwal : ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాం : సీఎం అర‌వింద్ కేజ్రీవాల్

Aap Will Leave Politics If Bjp Gets Mcd Polls Held On Time And Wins It

Updated On : March 23, 2022 / 4:19 PM IST

Delhi cm kejriwal dares bjp : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు మరింతగా పెంచింది. ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీజేపీ విజయం సాధిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం అంటూ ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలను స‌కాలంలో నిర్వ‌హించి.. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధిస్తే తాము రాజకీయ స‌న్యాసం తీసుకుంటామ‌ని అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Also read : Lalu Prasad Yadav : లాలూ ప్రసాద్ యాద‌వ్ కు మళ్లీ అస్వస్థత..ఢిల్లీ ఎయిమ్స్ లో అత్యవసర చికిత్స

బుధ‌వారం (మార్చి 23,2022)ఢిల్లీ అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ..బీజేపీకి స‌వాల్ విసిరారు. ఢిల్లీలో మున్సిపల్ ఎన్నిక‌ల‌ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా వేస్తూ వ‌స్తోంద‌ని కేజ్రీవాల్ ఆరోపించారు. అనంతరం ఈ మున్సిపల్ ఎన్నికలను స‌కాలంలో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌కపోతే స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల‌ను అవ‌మాన‌ప‌రిచిన‌ట్టేన‌ని అన్నారు. భారత స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో పోరాడిన అమరవీరులను అమరవీరులను బీజేపీ అవమానించిందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీజేపీ ఎన్నికలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తోంది అని ఆరోపిచారు.

Also read : Paddy Procurement : ధాన్యం కొనుగోళ్ల విషయంలో టి.సర్కార్‌‌కు కేంద్రం షాక్

బుధ‌వారం పార్ల‌మెంటు స‌మావేశాల్లో భాగంగా బీజేపీ ఓ బిల్లును ప్ర‌తిపాదించింది. ఢిల్లీలోని మూడు మునిసిప‌ల్ కార్పొరేష‌న్ల‌ను క‌లిపేస్తూ ఓ ప్ర‌తిపాద‌న పెట్టింది. ఈ విష‌యంపై కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అతి పెద్ద పార్టీగా చెప్పుకునే బీజేపీ.. ఆప్ లాంటి అతి చిన్న పార్టీని చూసి భయపడుతోందని అంటూ ఎద్దేవా చేశారు. మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను స‌కాలంలో నిర్వ‌హించ‌డంతో పాటుగా ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిస్తే.. ఆప్ రాజ‌కీయ స‌న్యాసం చేస్తుంద‌ని కేజ్రీవాల్ పేర్కొన్నారు.