Paddy Procurement : ధాన్యం కొనుగోళ్ల విషయంలో టి.సర్కార్‌‌కు కేంద్రం షాక్

తెలంగాణలో ఉత్పత్తి అయిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని ఖరాఖండిగా చెప్పేశారు. రాష్ట్రంలో ఉత్పత్తుల ఆధారంగా కొనుగోలు చేయలేమని, అదనంగా ఉన్న ఉత్పత్తులు, ధర, డిమాండ్, సరఫరా...

Paddy Procurement : ధాన్యం కొనుగోళ్ల విషయంలో టి.సర్కార్‌‌కు కేంద్రం షాక్

Paddy

Telangana Paddy Procurement : ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ సర్కార్ కు కేంద్రం షాక్ ఇచ్చింది. లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు. లిఖిత పూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు. తెలంగాణలో ఉత్పత్తి అయిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని ఖరాఖండిగా చెప్పేశారు. రాష్ట్రంలో ఉత్పత్తుల ఆధారంగా కొనుగోలు చేయలేమని, అదనంగా ఉన్న ఉత్పత్తులు, ధర, డిమాండ్, సరఫరా పరిస్థితుల ఆధారంగా కొనుగోలు చేయడం జరుగుతుందని తేల్చిచెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో…తెలంగాణ – కేంద్ర ప్రభుత్వాల మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Read More : Vizag Steel plant: విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మొండి వైఖరి: ఉమ్మడిగా వ్యతిరేకించిన టీడీపీ, వైసీపీ

యాసంగి ధాన్యం మొత్తం కొనాలంటూ తెలంగాణ మంత్రులు హస్తినలో మకాం వేసిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను అపాయింట్ మెంట్ అడిగిన సందర్భంలో…ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. రాష్ట్రాల్లో ఉన్న ధాన్యాన్ని, బియ్యాన్ని సేకరించడం జరుగుతుందని, కనీస మద్దతు ధర ప్రకారం రాష్ట్రాలు ముడి ధాన్యాన్ని సేకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ సేకరణ ప్రకారం రాష్ట్రాలు, ఎఫ్ సీఐ (FCI) చర్చల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాతే.. ఎంత సేకరించాలనే దానిపై ముందుగానే ఒప్పందం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎంత ధాన్యం పండితే అంతా కేంద్రం కొనుగోలు చేయాలనే అంశం ఎక్కడా లేదని లిఖిత పూర్వకంగా ఇచ్చి దానిలో తెలిపారు. గోధుమ, వరి ధాన్యాలను నిర్ధిష్ట పరిమితి, క్వాలిటీ ప్రకారం కొనుగోలు చేయడం జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.

Read More : Telangana Paddy Issue : ధాన్యం దంగల్.. కేంద్ర మంత్రితో భేటీ కానున్న టీఆర్ఎస్ ఎంపీలు

తెలంగాణలో పండిన పంట మొత్తం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ వ్యవహారంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయిపోయింది. ఏప్రిల్ 02 వరకు వేచి చూడాలని.. సానుకూలంగా స్పందించకపోతే.. ఉద్యమాలు చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలవడానికి తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు, ఎంపీలు ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్ మెంట్ కోరారు. 2022, మార్చి 24వ తేదీ గురువారం వారు మంత్రిని కలువనున్నారు. ఈక్రమంలో.. ఈ ప్రకటన వెలువడడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.