ఢిల్లీ ఫలితాల్లో AAP ఆధిపత్యం : కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టేశారు!

  • Publish Date - February 11, 2020 / 03:06 AM IST

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ముందంజలో ఉంది. న్యూఢిల్లీలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో ఉన్నారు. పట్ పడ్ గంజ్ లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ముందంజలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఢిల్లీలో కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టేశారు. 

మంగళవారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే ఆప్ దూసుకెళ్తోంది. 53 స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ 16 స్థానాలు, కాంగ్రెస్ 1 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 

ఆదర్శ్ నగర్ లో పవన్ శర్మ (ఆప్) ముందంజలో కొనసాగుతున్నారు. రోహిణిలో విజేందర్ గుప్తా (బీజేపీ) ముందంజలో కొనసాగుతున్నారు. బగ్గాలో తాజిందర్ పాల్ సింగ్ (బీజేపీ) ముందంజలో ఉన్నారు. చాందిని చౌక్ లో అల్కాలంబా (కాంగ్రెస్) వెనుకంజలో ఉన్నారు.