Operation Lotus: ‘ఆపరేషన్ కమలం’పై విచారణ జరపాలని కోరుతూ సీబీఐ ఆఫీస్ ముందు ఆప్ ధర్నా

బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని, ‘ఆపరేషన్ కమలం’ పేరుతో సాగిన ఈ కుట్రపై విచారణ జరపాలని ‘ఆప్’ డిమాండ్ చేస్తోంది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఆప్ నేతలు నిరసనకు దిగారు.

Operation Lotus: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టినట్లుగా భావిస్తున్న ‘ఆపరేషన్ కమలం’పై విచారణ జరపాలని కోరుతూ ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం ఎదుట ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నా నిర్వహించింది. ఆమ్ ఆద్మీకి చెందిన నేతలు బుధవారం ఈ ధర్నాలో పాల్గొన్నారు.

Jersey: ఇండియా-పాక్ మ్యాచ్.. పాకిస్తాన్ జెర్సీ ధరించిన భారతీయుడు… ప్రాంక్ కోసమట!

తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడిందని ఆప్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. తర్వాత బీజేపీపై ఆప్ మరిన్ని ఆరోపణలు చేసింది. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూల్చేందుకు బీజేపీ 6,300 కోట్ల రూపాయలు కేటాయించిందని, దీని కోసం అనేక ప్రయత్నాలు చేస్తోందని ఆప్ ఆరోపించింది. ‘ఆపరేషన్ కమలం’ పేరిట బీజేపీ ఈ కుట్రకు తెరలేపినట్లు ఆప్ వెల్లడించింది.

Punjab: పంజాబ్‌లో పాస్టర్ కారు దహనం చేసిన దుండగులు.. ఆ నేత వ్యాఖ్యలే కారణమా?

ఈ అంశంలో బీజేపీపై విచారణ జరపాలని కోరుతూ ఆప్ ఢిల్లీలో నిరసనకు దిగింది. ఆ పార్టీ ఎంపీలు సంజయ్ సింగ్, అతిషి, సౌరభ్ భరద్వాజ్, ఇతర నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల్ని కూల్చేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలపై సీబీఐ విచారణ జరపాలని వాళ్లు డిమాండ్ చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు