Jersey: ఇండియా-పాక్ మ్యాచ్.. పాకిస్తాన్ జెర్సీ ధరించిన భారతీయుడు… ప్రాంక్ కోసమట!

ఇండియా-పాక్ మ్యాచ్ సందర్భంగా సరదా కోసం పాకిస్తాన్ జెర్సీ ధరించాడో భారతీయుడు. దీంతో అతడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Jersey: ఇండియా-పాక్ మ్యాచ్.. పాకిస్తాన్ జెర్సీ ధరించిన భారతీయుడు… ప్రాంక్ కోసమట!

Jersey: సరదా (ప్రాంక్) పేరుతో పాకిస్తాన్ జెర్సీ ధరించిన భారతీయుడు ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. గత ఆదివారం ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్ దుబాయ్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ చూసేందుకు మన దేశం నుంచి చాలా మంది దుబాయ్ వెళ్లారు. వారిలో సన్యమ్ జైశ్వాల్ కూడా ఉన్నాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సన్యమ్ జైశ్వాల్ లిక్కర్ వ్యాపారం చేస్తుంటాడు.

Viral Video: ఇంత నిర్లక్ష్యమా.. అమెజాన్ పార్శిళ్లు విసిరేస్తున్న సిబ్బంది.. వీడియో వైరల్

తాజాగా మ్యాచ్ చూసేందుకు తన స్నేహితులతో కలిసి దుబాయ్ వెళ్లాడు. అయితే, అక్కడ అతడు పాకిస్తాన్ జెర్సీ ధరించడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు అతడిపై చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫొటోల్లో, అతడు పాకిస్తాన్ జెర్సీ ధరించి.. ఒక చేతిలో భారత జెండా, మరో చేతిలో పాకిస్తాన్ జెండా పట్టుకుని ఉన్నాడు. అయితే, ఈ వివాదంపై సన్యమ్ జైశ్వాల్ స్పందించాడు. ప్రాంక్ కోసమే ఈ పని చేసినట్లు చెప్పాడు. ‘‘మ్యాచ్ చూసేందుకు వెళ్లిన తర్వాత భారత జెర్సీ కొనుక్కుందామనుకున్నాను. అన్ని షాపులు తిరిగాను. కానీ, ఎక్కడా భారత జెర్సీ దొరకలేదు. అన్ని చోట్లా స్టాక్ అయిపోయింది.

Assam: తీవ్రవాదులతో లింకులు.. మదర్సాలు కూల్చివేస్తున్న అసోం సర్కార్

అయితే, పాకిస్తాన్ జెర్సీ కనిపించడంతో అది కొనుక్కుని ధరించాను. దీంతో ప్రాంక్ చేద్దామనుకున్నాను. పాకిస్తాన్ జెర్సీ ధరించి, హిందుస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేస్తే, అందరూ ఎలా స్పందిస్తారో చూద్దామనుకున్నాను. అలాగే చేశాను. ఇది చూసి కొందరు పాకిస్తానీలు నన్ను వెక్కిరించారు’’ అని సన్యమ్ జైశ్వాల్ చెప్పాడు. ప్రస్తుతం తాను దుబాయ్‌లోనే ఉన్నట్లు చెప్పాడు. అయితే, అతడు ఇండియా వచ్చిన తర్వాత చట్టపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది.