ఈ ఫొటో ఎంత బాగుంది.. ముచ్చటగా ఉంది కదా.. చిన్నారులు ఓ చేతిలో జాతీయ జెండాలు.. మరో చేతిలో అభినందన్ ఫొటోలు పట్టుకుని వెల్‌కమ్ చెబుతున్నారు. వాఘూ సరిహద్దుల్లో కమాండర్ అభినందన్ కు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు ప్రజలు. అమృత్ సర్ కు చెందిన పాఠశాల పిల్లలు కూడా వేల సంఖ్యలో వచ్చారు.
Read Also : షోయాబ్.. హైదరాబాద్ వస్తే తాట తీస్తాం: నెటిజన్స్ ఫైర్
వీళ్లందరూ వాఘూ దగ్గర జై భారత్ నినాదాలు చేస్తూ కనిపించారు. పిల్లలు అయితే ‘భారత్ మాతా కీ జై’.. ‘అభినందన్ వెల్‌కమ్’ అంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. ఏ మాత్రం ప్రతిఫలం ఆశించకుండా ప్రాణాలకు తెగించి పోరాడే సైనికులకు ఇది ఓ అపురూప గౌరవం.
Read Also : ఆధార్ అప్ డేట్ : ఇకపై ఆ మూడింటికీ తప్పనిసరి
దేశ రక్షణకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని బయటపెట్టకుండా ప్రాణాలకు తెగించి కాలిపోతున్న యుద్ధ విమానం నుంచి బయటికి దూకిన అభిని దేశమంతా కీర్తిస్తూ స్వాగతం పలుకుతోంది.