ఇవాళ(ఫిబ్రవరి-1) పార్లమెంట్ లో కేంద్రప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ లోక్ సభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమయిన కేబినెట్ బడ్జెట్ ను ఆమోదించింది.