Actor Gautami : బీజేపీకి సినీ న‌టి గౌత‌మి రాజీనామా..! ఎంతో బాధ‌తో..

సినీ న‌టి గౌత‌మి తాడిమళ్ల భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేశారు. త‌న ఆస్తుల‌ను దోచుకున్న వ్య‌క్తికి పార్టీ సీనియ‌ర్ నేత‌లు స‌హాయం చేస్తున్నార‌ని ఆమె ఆరోపించారు.

Actor Gautami Tadimalla

Actor Gautami Tadimalla : సినీ న‌టి గౌత‌మి తాడిమళ్ల భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేశారు. త‌న ఆస్తుల‌ను దోచుకున్న వ్య‌క్తికి పార్టీ సీనియ‌ర్ నేత‌లు స‌హాయం చేస్తున్నార‌ని ఆమె ఆరోపించారు. పార్టీ నుంచి త‌న‌కు ఎలాంటి స‌హ‌కారం ల‌భించ‌డం లేద‌ని, దీంతో పాతికేళ్లుగా బీజేపీతో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. 2021 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ఇస్తాన‌ని హామీ ఇచ్చార‌న్నారు. అయితే.. చివ‌రి నిమిషంలో త‌న‌కు మొండి చెయ్యి చూపించార‌న్నారని ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఓ లెట‌ర్‌ను గౌత‌మి పోస్ట్ చేశారు.

ఆ లెట‌ర్ లో ఏం ఉందంటే..?

తాను గ‌త 25 ఏళ్లుగా బీజేపీలో స‌భ్యురాలిగా ఉంటూ చిత్త శుద్ధితో ప‌ని చేసిన‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం త‌న జీవితంలో ఊహించ‌లేని సంక్షోభంలో ఉన్న‌ట్లు తెలిపింది. అయితే.. పార్టీ, నాయ‌కుల నుంచి త‌న‌కు ఎలాంటి మ‌ద్ద‌తు లేద‌ని అంతేకాకుండా త‌న‌ను మోసం చేసిన వ్య‌క్తి మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని ఆరోపించింది.

Assembly Elections 2023: రాజస్థాన్, ఛత్తీస్‭గఢ్‭ కంటే మధ్యప్రదేశే ఎందుకు బీజేపీకి అంత కీలకం?

కాగా.. స్థిరాస్తుల విష‌యంలో అళ‌గ‌ప్ప‌న్ అనే వ్య‌క్తి త‌న‌ను మోసం చేశారంటూ గౌత‌మి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అత‌డిపై ఎఫ్ఐఆర్ న‌మోదు అయ్యి 40 రోజులు గ‌డిచినా కూడా అత‌డు త‌ప్పించుకుని తిరిగేలా అత‌డికి కొంద‌రు నాయ‌కులు సాయం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇక 2021 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌కు రాజ‌పాళ‌యం నుంచి అవ‌కాశం ఇస్తాన‌ని మాట ఇచ్చార‌ని, అయితే.. ఆఖ‌రి నిమిషంలో వెన‌క్కు తీసుకున్నార‌న్నారు. పార్టీ నుంచి మ‌ద్ద‌తు క‌రువైంది. ఎంతో బాధ‌తో, నిరాశ‌తో పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ఆ లేఖ‌లో గౌత‌మి తెలిపారు. రాజీనామా లేఖ‌ను బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, త‌మిళ‌నాడు పార్టీ యూనిట్ చీఫ్ కే అన్న‌మ‌లైకు పంపారు.