Actor Nushrratt Bharuccha : ఇజ్రాయెల్ నుంచి ఇండియాకు వచ్చే విమానం ఎక్కిన సినీనటి నుష్రత్

ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్ వెళ్లిన బాలీవుడ్ సినీనటి నుష్రత్ భరుచ్ఛా ఎట్టకేలకు భారత్ కు వచ్చే విమానం ఎక్కారు. ఇజ్రాయెల్ దేశంపై హమాస్ దాడులతో యుద్ధానికి తెర లేచింది.....

Actor Nushrratt Bharuccha

Actor Nushrratt Bharuccha : ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్ వెళ్లిన బాలీవుడ్ సినీనటి నుష్రత్ భరుచ్ఛా ఎట్టకేలకు భారత్ కు వచ్చే విమానం ఎక్కారు. ఇజ్రాయెల్ దేశంపై హమాస్ దాడులతో యుద్ధానికి తెర లేచింది. ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం నేపథ్యంలో నుష్రత్ ను సురక్షితంగా భారతదేశానికి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ దేశంలోని భారత రాయబార కార్యాలయం చర్యలు చేపట్టింది. నటి నుష్రత్ దాడుల నేపథ్యంలో వారి బృందంతో సంబంధాలు తెగిపోయాయి. నుష్రత్ భరుచ్ఛాను డైరెక్టు విమానంలో కాకుండా ఇండియా కనెక్టెడ్ విమానంలో భారతదేశానికి తీసుకువస్తున్నట్లు నటుల బృందం తెలిపింది.

Read Also : Bollywood Actor : ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా…నేలమాళిగలో సురక్షితం

సినీనటి హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు ఇజ్రాయెల్ దేశానికి రాగా హమాస్ దాడులు జరిగాయి. భరుచ్చా తన సినిమా అకెల్లి ప్రదర్శన కోసం హైఫా నగరంలో ఉన్నారు. ఈ చిత్రంలో ప్రముఖ వెబ్ సిరీస్ ఫౌడాలో నటించిన ఇజ్రాయెల్ నటులు సాహి హలేవి, అమీర్ బౌట్రస్ కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ రాకెట్ దాడి, టెల్ అవీవ్ ప్రతిఘటనలో ఇప్పటివరకు 500 మంది మరణించారు.

Read Also : Israel : ఇజ్రాయెల్ స్డెరోట్‌ పట్టణ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు

ఇజ్రాయెల్‌లో జరిగిన ఉగ్రదాడుల నివేదికలు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని మరియు భద్రతా ప్రోటోకాల్‌లను పాటించాలని భారత రాయబార కార్యాలయం ఒక సలహాలో పేర్కొంది.

Read Also : Earthquakes : అప్ఘానిస్థాన్‌లో 8 సార్లు భూ ప్రకంపనలు.. 320 మంది మృతి

ట్రెండింగ్ వార్తలు