ఉరి హీరో ఆగ్రహం : ఉగ్రవాదానికి సరైన సమాధానం చెప్పాల్సిందే

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) పాక్ ఉగ్రసంస్థ  జైషే మహమద్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ ని తీవ్రంగా కండించారు బాలీవుడ్ హీర్ విక్కీ కౌశల్. పుల్వామా ఉగ్రదాడి తనను ఎంతో భాధించిందని తెలిపారు. ఉగ్రదాడిలో 49మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం పట్ల  వ్యక్తిగత నష్టంగా తాను ఫీల్ అవుతున్నానని అన్నారు.ఉగ్రవాదానికి సరైన సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. ఒక దేశంగా మనందరం కలిసికట్టుగా ముందుకొచ్చి అమరు జవాన్ల కుటుంబాలకు  ఎమోషనల్ గా, ఆర్థికంగా అవసరమైన సపోర్ఠ్ అందించాలని అన్నారు. అమరుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

2016 సెప్టెంబర్-18న జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని  ఉరి టౌన్ దగ్గర్లో 2016 సెప్టెంబర్-18న భద్రతా బలగాలపై నలుగురు అత్యాధునిక ఆయుధాలతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఆధారాంగా తెరకెక్కిన ఉరి సినిమాలో హీరోగా విక్కీ కౌశల్ నటించి అందరిచేత ప్రశంశలందుకొన్నాడు. ఉరి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకొనేందుకు ఉరి మూవీ టీమ్ కోటి రూపాయల సాయం కూడా ప్రకటించింది.