Actor Vijay Thalapthy : తమిళ రాజకీయాల్లో గ్రాండ్‌ ఎంట్రీకి సన్నద్ధమవుతున్న విజయ్ దళపతి.. లోక్ సభ బరిలో నిలుస్తారా?

Actor Vijay Thalapthy

Vijay Thalapathy into Politics : తమిళనాట మరోహీరో కొత్తపార్టీని ప్రారంభించబోతున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా పార్టీని ఏర్పాటు చేయనున్న ఇలయ దళపతి విజయ్ మరో నెలరోజుల్లోనే ఇందుకు సంబంధించిన లాంఛనాలను పూర్తిచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత గురువారం ఆయన తన అభిమానులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కొత్త పార్టీ ఆలోచనలు వారితో పంచుకున్నట్లు చెబుతున్నారు.

దక్షిణాదిలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో దళపతి విజయ్. తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత అంత స్టార్ఇమేజ్ ఉన్న హీరో విజయ్. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే దళపతి విజయ్.. రాజకీయాల్లో రావాలంటూ ఎప్పటినుంచో డిమాండ్ లు వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ కూడా విజయ్ రాజకీయ అరంగ్రేటంపై ప్రకటన చేశారు. కానీ, విజయ్ సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ ప్రకటనపై అవునని కానీ, కాదని కానీ స్పందించలేదు. కానీ, గతకొంతకాలంగా విజయ్ అడుగులన్నీ రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు సిద్ధమనే సంకేతాలే ఇస్తున్నాయి.

Also Read : ఇది గుంటూరా? గుంటలూరా? ఉద్యోగాలు లేవు, జీతాలూ లేవు.. జగన్ సర్కార్‌పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్

జనవరి 25న చెన్నైలో తన అభిమానులతో విజయ్ సమావేశం అయ్యారు. చెన్నై, కోవై, తిరుచ్చి, మధురైతో పాటు అన్ని జిల్లాల నుంచి 150 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తన పేరిట సేవా కార్యక్రమాలు చేస్తున్న విజయ్ అభిమాన సంఘంతో పాటు విజయ్ మక్కల్ ఇయక్కం పేరిట కొత్త పార్టీ రిజిస్ట్రర్ చేయాలని సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దళపతి విజయ్ అభిమానుల సమావేశం, కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవటం వంటి విషయంపై తమిళమీడియాతో పాటు జాతీయ మీడియాలోనూ విస్తృత కథనాలు ప్రచారం అవుతున్నాయి. దళపతి విజయ్ కొత్త పార్టీ అంటూ సోషల్ మీడియాలోకూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే, వచ్చే నెల రోజుల్లో పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేయాలని తన అభిమాన సంఘానికి విజయ్ సూచించినట్లు తెలిసింది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక పార్టీ ఏర్పాటు ప్రకటన చేయాలని, రాకీయాల్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని దళపతి వ్యూహంగా చెబుతున్నారు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గోట్’ సినిమాలో విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో మార్చిలో దళపతి కొత్త పార్టీ ప్రకటన ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Also Read : Nitish Kumar: బిగ్ ట్విస్ట్.. బీజేపీతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం నితీశ్ కుమార్ ఏం చేస్తున్నారో తెలుసా?

తమిళనాట హీరోలు పార్టీలు ప్రారంభించడం కొత్తేమీ కాదు.. కాకపోతే ఇటీవలి కాలంలో కొత్త పార్టీలు పెట్టిన, పెడతామని ప్రకటించిన హీరోలెవరూ సక్సెస్ కాలేకపోయారు. తమిళ సినీ రంగానికి, రాజకీయ రంగానికి విడదీయరాని సంబంధం ఉంది. సమకాలీన రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత వంటివారు సినీరంగం నుంచి తమిళ రాజకీయ రంగంలో అడుగు పెట్టిన వారు. వీరిముగ్గురూ తమిళనాట తమ ముద్ర వేశారు. ఇక వీరిబాటలో రాజకీయాల్లోకి వచ్చిన కెప్టెన్ విజయ్ కాంత్, విశ్వనటుడు కమలహాసన్ రాజకీయాల్లో పెద్దగా రాణించలేక పోయారు. విజయ్ కాంత్ పార్టీ కొన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలిచి సభలో అడుగుపెట్టింది. కమల్ హాసన్ పార్టీ ఊసేలేకుండా పోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ ప్రారంభిస్తానని ప్రకటించిప్పటికీ.. కొద్దిరోజుల్లోనే రాజకీయాలు తనకు సరిపోవని ప్రకటించారు. తాజాగా యంగ్ హీరోగా కోలీవుడ్ ను ఏలుతున్న దళపతి విజయ్ కొత్త పార్టీ పెట్టేందుకు చురుగ్గా పావులు కదుపుతుండటం హాట్ టాపిక్ గా మారింది.

విజయ్.. మక్కల ఇయక్కం పేరిటే కొత్తపార్టీ ప్రకటిస్తారా.. వేరే పేరు ఏమైనా పెడతారా అనే అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న ఈ పరిస్థితుల్లో దళపతి విజయ్ నిజంగానే కొత్త పార్టీ ప్రకటిస్తారా? కొత్త పార్టీ ప్రారంభిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్నప్రశ్నల చుట్టూనే చర్చ జరుగుతుంది.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు