ఇది గుంటూరా? గుంటలూరా? ఉద్యోగాలు లేవు, జీతాలూ లేవు.. జగన్ సర్కార్‌పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్

దక్షిణ భారత దేశంలో ఏ రాష్ట్రంలో మెట్రో లేదు అంటే అది ఆంధ్రప్రదేశ్ లోనే. అందరూ సినిమాలు చూపించారు. పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు.

ఇది గుంటూరా? గుంటలూరా? ఉద్యోగాలు లేవు, జీతాలూ లేవు.. జగన్ సర్కార్‌పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్

YS Sharmila Fires On CM Jagan

YS Sharmila : జగన్ సర్కార్ టార్గెట్ గా చెలరేగిపోతున్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు షర్మిల. తాజాగా జగన్ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారామె. ఏపీలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు షర్మిల. కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే, కనీసం ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేదన్నారు షర్మిల. ఇక, ఇది గుంటూరా? గుంటలూరా? అంటూ విరుచుకుపడ్డారు షర్మిల. ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

”ఐదేళ్ల పాలనలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఇది గుంటూరు కాదు గుంటలూరు. పేర్చు మార్చేశారేమో. వైసీపీ ప్రభుత్వ పాలనలో కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే డబ్బులు ఇవ్వలేకపోతే ఇక రోడ్లు ఎక్కడ వేస్తారు?

Also Read : వైఎస్‌ కుటుంబంలో రాజకీయ యుద్ధం.. షర్మిలతో జగన్‌కు చిక్కులు తప్పవా?

మీ గుంటలూరు గుంటూరు కావాలి అంటే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవుతుంది. దక్షిణ భారత దేశంలో ఏ రాష్ట్రంలో మెట్రో లేదు అంటే అది ఆంధ్రప్రదేశ్ లోనే. అందరూ సినిమాలు చూపించారు. పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ఏదో బటన్ నొక్కుతున్నాము, డబ్బులు వచ్చేస్తున్నాయి అంటున్నారే.. మీరు బటన్ నొక్కితే వచ్చే డబ్బులకు, పెట్టే ఖర్చులకి ఏమైనా పొంతన ఉందా? ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. రైతుల పంట వేసుకునే పరిస్థితి ఉందా?” అంటూ నిప్పులు చెరిగారు షర్మిల. గుంటూరులో కార్యకర్తల సమావేశంలో షర్మిల ఈ కామెంట్స్ చేశారు.

Also Read : టీడీపీ-జనసేన కూటమిలోకి కమలం పార్టీ! బీజేపీకి కేటాయించే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే?