Vijaya Lakshmi : అయ్యో పాపం.. అర్థరాత్రి రోడ్డునపడ్డ సినీ నటి, అద్దె కట్టలేదని ఇంటి నుంచి గెంటేశారని కన్నీటిపర్యంతం…

తమిళ నటి విజయలక్ష్మిని కష్టాలు వీడటం లేదు. ఇప్పుడామె రోడ్డున పడ్డారు. అద్దె కట్టలేదని అర్థరాత్రి వేళ తనను ప్లాట్ నుంచి గెంటేశారని, తన సామాను నడిరోడ్డులో పడేశారని అంటూ కంటతడి పెట్టారు. చెన్నైలోని టీనగర్‌ హబీబుల్లా రోడ్డులోని ఓ సర్వీసు అపార్ట్‌మెంట్‌లో విజయలక్ష్మి, ఆమె సోదరి నివాసం ఉంటున్నారు. కాగా, విజయలక్షి సోదరి అనారోగ్యం పాలైంది. దీంతో కొద్దిరోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. శనివారం(ఏప్రిల్ 24,2021) రాత్రి డిశ్చార్జ్‌ కావడంతో విజయలక్ష్మి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చి చూసి ఆమె షాక్‌ తిన్నారు.

Vijaya Lakshmi

Actress Vijaya Lakshmi : తమిళ నటి విజయలక్ష్మిని కష్టాలు వీడటం లేదు. ఇప్పుడామె రోడ్డున పడ్డారు. అద్దె కట్టలేదని అర్థరాత్రి వేళ తనను ప్లాట్ నుంచి గెంటేశారని, తన సామాను నడిరోడ్డులో పడేశారని కంటతడి పెట్టారు. చెన్నైలోని టీనగర్‌ హబీబుల్లా రోడ్డులోని ఓ సర్వీసు అపార్ట్‌మెంట్‌లో విజయలక్ష్మి, ఆమె సోదరి నివాసం ఉంటున్నారు. కాగా, విజయలక్షి సోదరి అనారోగ్యం పాలైంది. దీంతో కొద్దిరోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. శనివారం(ఏప్రిల్ 24,2021) రాత్రి డిశ్చార్జ్‌ కావడంతో విజయలక్ష్మి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చి చూసి ఆమె షాక్‌ తిన్నారు.





తమ ప్లాట్‌లో మరో వ్యక్తి ఉండడంతో ఆమె కంగుతిన్నారు. వెంటనే మేనేజర్‌ విఘ్నేశ్వరన్‌ను సంప్రదించారు. కాగా, 3 నెలలుగా అద్దె చెల్లించని దృష్ట్యా ఆమె సామాన్లను మరో గదిలో పెట్టినట్టు ఆయన చెప్పారు. దీంతో ఆందోళన చెందిన విజయలక్ష్మి మీడియాకు సమాచారం ఇచ్చారు. తన సామాన్లు బయట పడేశారని, తాను రోడ్డున పడ్డానని వాపోయారు. రాజకీయ నేత హరినాడర్‌ అన్నయ్య తీసుకొచ్చి తనను ఈ ప్లాట్‌లో ఉంచారని, ఆయన్ను సంప్రదించకుండా తనను రోడ్డున పడేశారని కన్నీటి పర్యంతం అయ్యారు.





దీనిపై ప్లాట్ మేనేజర్‌ విఘ్నేశ్వరన్‌ స్పందించాడు. తామేమీ ఆమె సామాన్లు బయట పడేయలేదని, ఓ గదిలో ఉంచామని చెప్పాడు. తమ ప్లాట్‌ సిబ్బంది శివను విజయలక్ష్మి చెప్పుతో కొట్టిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించాడు. అసలు హరినాడర్‌కు ఈ ప్లాట్‌కు సంబంధమే లేదన్నాడు. విజయలక్ష్మిని జావెద్‌ అనే వ్యక్తి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని చెప్పాడు. అర్ధరాత్రి వేళ ఈ వ్యవహారం ముదరడంతో తేనాంపేట పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. విజయలక్ష్మికి తాత్కాలికంగా ప్రత్యామ్నాయం కల్పించారు.





నటి విజయలక్ష్మి గతంలోనూ ఇలానే రచ్చ చేశారు. నామ్‌ తమిళర్‌ కట్చి నేత, నటుడు, దర్శకుడు సీమాన్‌ తనను మోసం చేశారంటూ గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. పలుమార్లు ఆత్మహత్యకు యత్నించడం అప్పట్లో కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీమాన్‌కు ఆమె వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో నామ్‌ తమిళర్‌ కార్యకర్తలు పలుమార్లు ఆమెకు బెదిరింపులు కూడా ఇచ్చారు. ఇన్నాళ్లు సీమాన్‌పై దుమ్మెత్తి పోసిన విజయలక్ష్మి.. తాజాగా.. సీమాన్ తనను ఆదుకోవాలని కంటతడి పెట్టడం గమనార్హం. మొత్తంగా ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు విజయలక్ష్మిని వెంటాడుతున్నాయి. ఆమె దయనీయ స్థితి చూసి స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అయ్యో పాపం అని జాలి చూపిస్తున్నారు.