Assam Cm Himanta Biswa Sarma
Assam CM comments for Muslim family control : అస్సాం CM హిమంత బిస్వా శర్మ ముస్లింలు పిల్లల్ని కనే విషయంలో వ్యాఖ్యనించారు. సామాజిక సమస్యలకు అధిక జనాభానే కారణమని అని అన్న ఆయన వలస వచ్చిన ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటిస్తే చాలా సమస్యలు పరిష్కరించవచ్చని అన్నారు. ముస్లింలు ఎక్కువమంది పిల్లల్ని కనటం మానేస్తే..భూ కబ్జాలను అరికట్టవచ్చని అన్నారు. కాగా..మధ్య..దిగువ అస్సాంలో బెంగాలీ మాట్లాడే ముస్లింలను బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన ముస్లింలుగా అస్సామీయులు భావిస్తారు. వారిని దృష్టిలో పెట్టుకుని సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.
వలస వచ్చిన ముస్లింలకు నా విజ్ఞప్తి అని మాట్లాడిన సీఎం హిమంత్ బిస్వా శర్మ ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటిస్తే..అస్సాంలో అనేక సామాజిక రుగ్మతలను పరిష్కరించవచ్చని అన్నారు. ముఖ్యంగా ముస్లిం కుటుంబాల్లో అధిక జనాభా వల్లనే పేదరికానికి కారణమని అన్నారు. కుటుంబ నియంత్రణ పాటిస్తూ..వారి కుటుంబాల్లో మహిళలు చదువుకోవాలని సూచించారు. అప్పుడే పేదరికాన్ని నిర్మూలించగలమని సూచించారు. వలస వచ్చిన ముస్లిం మహిళ చదువు కోసం మద్దతు ఇవ్వటానికి మేం సిద్ధంగా ఉన్నామనీ పేదరికం తగ్గించటానికి మీరంతా మాతో కలిసి పనిచేయాలని ముఖ్యంగా కుటుంబ నియంత్రణ పాటించాలని సూచించారు.
పిల్లల్ని కంటూ పోతే జనాభా భారీగా పెరిగిపోతుందని..జనాభా పెరిగితే తన ఇల్లు కూడా కబ్జా అవుతుందని కుటుంబ నియంత్రణ పాటించే విషయంలో ముస్లిం పార్టీలతోను వారి పెద్దలతోను కలిచి చర్చించటానికి మేం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కుటుంబ నియంత్రణ పాటించకపోతే ముస్లిం కుటుంబాల్లో పేదరికం సమస్య తగ్గదని అన్నారు. ముఖ్యంగా జనాభా భారాన్ని తగ్గించడానికి మైనారిటీ ముస్లిం సమాజంతో కలిసి పనిచేయాలనుకుంటున్నామని సీఎం స్పష్టంచేశారు.
కాగా..2011 జనాభా లెక్కల ప్రకారం..అస్సాంలో 3.12 కోట్ల జనాభాలో వలస ముస్లింలు 34.2 శాతం ఉన్నారు.