శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఎవ్వరూ గుర్తు పట్టకుండా మగవాళ్ల దుస్తుల్లో అయ్యప్ప ఆలయంలోకి బుధవారం(జనవరి16,2019) ఉదయం ఇద్దరు మహిళలు ప్రవేశించేందుకు యత్నించడంతో ఆలయ పరిసరాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.
ఉదయం 4గంటల సమయంలో కన్నూర్ కి చెందిన రేష్మా నిశాంత్, షనిలా సజేష్ అనే ఇద్దరు మహిళలు మగవాళ్లలా దుస్తులు ధరించి పంబ బేస్ క్యాంప్ దాటి వెళ్తుండగా నీలిమల దగ్గర వీరిని వందల సంఖ్యలో ఆందోళనకారులు అడ్డుకొన్నారు. ఒక్క అడుగు ముందుకేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళనాకారులు ఇద్దరు మహిళలను హెచ్చరించారు. దీంతో పోలీసులు ఇద్దరు మహిళలను సురక్షిత ప్రాంతానికి తరలించారు.