Advocates’ association writes to CJI over quick posting of anticipatory bail plea of BJP MLA Virupakshappa
Karnataka: అవినీతి కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే వేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రావడంపై న్యాయవాదుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ-1గా ఉన్న వ్యక్తి బెయిల్ పిటిషన్ అంత త్వరగా విచారణకు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాద సంఘం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాసింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన విరూపాక్ష అనే ఎమ్మెల్యే కేసులో ఎదురైన పరిణామం ఇది. కాగా, సీజేఐకి లేఖ రాసింది బెంగళూరు న్యాయవాద సంఘం.
సీజీఐకి రాసిన లేఖలో వీఐపీలకు సంబంధించిన అంశాలు రాత్రికి రాత్రే విచారణకు తీసుకోవడాన్ని న్యాయవాద సంఘం ప్రధానంగా ప్రస్తావించింది. అందరికీ సమన్యాయం ఉండాలని, పదవులు ఇతర అంశాల ప్రాతిపదికన విచారణ చేయకూడదని పేర్కొంది. ఇక ఇదే సమయంలో ముందస్తు బెయిల్ మీద వచ్చే దరఖాస్తులన్నీ ఒకేరోజు విచారణకు తీసుకునేలా రిజస్ట్రీని ఆదేశించాలని కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖలో అదే బెంగళూరు న్యాయవాద సంఘం డిమాండ్ చేసింది. దీని ద్వారా సామాన్యులను కూడా వీఐపీలుగా పరిగణించవచ్చని పేర్కొంది.
Sanjay Raut: హీటెక్కిస్తున్న రౌత్ ఘాటు వ్యాఖ్యలు ఆ ఎమ్మెల్యేలను ఉద్దేశించినవేనట!
విరూపాక్ష కుమారుడు లంచం తీసుకుంటూ లోకాయుక్త చేతికి చిక్కారు. ఈ కేసులో విరూపాక్షనే ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఎమ్మెల్యే విరూపాక్ష తరపునే కుమారుడు లంచం తీసుకున్నాడని లోకాయుక్త అనుమానిస్తోంది. అందుకే ఆయనను ఏ-1గా చేర్చారు. అయితే ఆయనను అదుపులోకి తీసుకునేందుకు లోకాయుక్త ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. అప్పటికే ఆయన అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఇక అజ్ణాతం నుంచే ఈ కేసుకు తనకు సంబంధం లేదని, తనకు అరెస్ట్ నుంచి విముక్తి కల్పిస్తూ ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విరూపాక్ష దరఖాస్తు చేసుకున్నారు.