Afghanistan Crisis :హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసిన మోదీ

అప్ఘానిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులను మరియు అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను మరియు అప్ఘానిస్తాన్ మైనార్టీలను సేఫ్ గా స్వదేశానికి తీసుకురావడాన్ని సమీక్షించేందుకు భారత ప్రధాన మంత్రి

Pm

Afghanistan Crisis అప్ఘానిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులను మరియు అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను మరియు అప్ఘానిస్తాన్ మైనార్టీలను సేఫ్ గా స్వదేశానికి తీసుకురావడాన్ని సమీక్షించేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఓ అత్యున్నత స్థాయి బృందాన్ని నియమించారని మంగళవారం(ఆగస్టు-31,2021)అధికార వర్గాలు తెలిపాయి.

విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సహా సంబంధిత మంత్రిత్వశాఖల అధికారులు మోదీ నియమించిన బృందంలో ఉన్నారు. భారత్​ కు తక్షణ ప్రాధాన్యమైన అంశాలను గుర్తించి, వాటిపై దృష్టిసారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ బృందానికి ఆదేశించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అప్ఘాన్ భూభాగాన్ని భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఉపయోగించుకోకుండా చూడాలని మోదీ ఈ బృందానికి స్పష్టం చేశారు.

కాగా, మోదీ మార్గనిర్దేశనంలో ఈ బృందం.. కొద్దిరోజులుగా తరచూ భేటీ అవుతోందని తెలిపాయి. అప్ఘాన్ భూభాగాన్ని భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఉపయోగించుకోకుండా చూడాలని మోదీ ఈ బృందానికి స్పష్టం చేశారు. ప్రస్తుతం అప్ఘానిస్తాన్ లో పరిస్థితుతులు, అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలు, ఐరాస భద్రతా మండలిలో ఆమోదించిన తీర్మానాన్ని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

కాగా,గత రెండు దశాబ్దాల కాలంలో అఫ్ఘానిస్తాన్​ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన భారత్.. అక్కడి పరిస్థితులపై వేచి చూసే ధోరణి పాటిస్తోంది. తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు పూర్తయ్యే వరకు వేచి చూస్తోంది. అప్ఘాన్ అంశంపై ఇతర దేశాలతో సంప్రదింపులు చేస్తోంది. గల్ఫ్ దేశాలతోనూ తరచుగా భారత్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

అఫ్ఘాన్ ని ఖాళీ చేసిన అమెరికా

మరోవైపు, అప్ఘానిస్తాన్ నుంచి అమెరికా పూర్తిగా వైదొలిగింది. ఆగస్టు 31 డెడ్‌లైన్‌కు ముందు రోజు సోమవారం రాత్రే అఫ్ఘాన్ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయింది. దీంతో రెండు దశాబ్దాల యుద్ధానికి తెరపడటమే కాకుండా అప్ఘానిస్తాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వచ్చినట్లయింది. సోమవారం రాత్రి అమెరికా చివరి విమానం బయల్దేరగానే కాబుల్​లోని హమిద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాలిబన్లు తమ అధీనంలోకి తీసుకున్నారు.

బలగాల ఉపసంహరణ పూర్తికాగానే కాబుల్ వ్యాప్తంగా తాలిబన్లు, మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. అమెరికా సైనికులు అఫ్ఘాన్ వీడగానే తాలిబన్లు కాబూల్ ఎయిర్ పోర్ట్ హ్యాంగర్ లోకి ప్రవేశించి చినూక్ హెలికాప్ట‌ర్లు, సాయుధ వాహ‌నాల‌ను ప‌రిశీలించారు. దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అమెరికా అప్ఘాన్ దేశం విడిచి వెళ్లటడానికి ముందు తాము వదిలేసిన అనేక ఎయిర్‌క్రాఫ్ట్‌, సాయుధ వాహ‌నాలు, ఆయుధాల‌ను అమెరికా సైనికులు ప‌ని చేయ‌కుండా నిలిపివేశారని తెలుస్తోంది.

READAfghanistan : ప్రజాస్వామ్యం ఉండదు..షరియా మాత్రమే..తాలిబన్ క్లారిటీ