Delhi Assembly: ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో బ్రిటీష్ కాలం నాటి సొరంగం

ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో బ్రిటీష్ కాలం నాటి సొరంగం బయటపడింది. దాంతో పాటు నేరస్థులను ఉరితీసే ప్రదేశం కూడా కనిపించింది. 1912లో కోల్‌కతా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ తరలించిన సమయంలో ...

Delhi Assembly: ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో బ్రిటీష్ కాలం నాటి సొరంగం

Tunnel

Updated On : December 14, 2021 / 12:48 PM IST

Delhi Assembly: ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో బ్రిటీష్ కాలం నాటి సొరంగం బయటపడింది. దాంతో పాటు నేరస్థులను ఉరితీసే ప్రదేశం కూడా కనిపించింది. 1912లో కోల్‌కతా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ తరలించిన సమయంలో బిల్డింగ్ నిర్మించారు. 1913 నుంచి 1926మధ్య కాలంలో వాడుకలో ఉంది.

ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ మాట్లాడుతూ.. 1926తర్వాత అది నిరుపయోగంగా ఉంది. అప్పట్లో బ్రిటీష్ అడ్మినిస్ట్రేటర్లు ఈ బిల్డింగును కోర్టుగా మార్చి తిరుగుబాటుదారులపై విచారణ జరిపించేవారు. ‘తిరుగుబాటుదారులను ఎర్రకోట నుంచి సొరంగం ద్వారా ఇక్కడకు తరలించేవారు’ అని గోయెల్ చెప్పారు. ఖైదీలును హాల్ లో ఉంచి.. దోషులను ఉరితీయడానికి తరలించేవారు.

అక్కడ పనిచేసే వర్కర్ చెప్పడంతో కొత్తగా కనిపిస్తున్న గోడ లోపల బోలుగా శబ్ధం వినిపించింది. దానిని పగులగొట్టాలనుకునే అలా చేశామని ఆర్కియాలజీ అధికారులు అంటున్నారు.

……………………………………. : ఉలవల సాగులో యాజమాన్యం

ఢిల్లీ విధాన సభ టూరిస్టుల కోసం తెరిచే ఉంటుంది. అంతకంటే ముందు టూరిస్టుల కోసం ఈ సొరంగాన్ని రెనోవేట్ చేయాలని అనుకుంటున్నట్లు గోయెల్ చెప్పారు. బిల్డింగ్ మొత్తం 109 సంవత్సరాల వయస్సుంది. కాకపోతే ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోకి రాదని తెలుస్తుంది.