ఆల్ పార్టీ – వన్ వాయిస్ : దేశం జోలికొస్తే సహించం

మంగళవారం(ఫిబ్రవరి-26,2019) ఉదయం పాక్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన దాడుల తర్వాత  ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ భవన్ లో  కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్,నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో పాక్ లోని ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన మెరుపుదాడికి సంబంధించిన సమాచారాన్ని ప్రతిపక్ష నేతలకు సుష్మా వివరించారు.
Also Read : అర్థరాత్రి యుద్ధం : పాక్ విమానాలు వెంటాడినా.. భారత్ పైటర్లు చిక్కలేదా!

యూస్ స్టేట్ సెక్రటరీతో జైషే ఉగ్రశిబిరాలపై భారత్ దాడులకు సంబంధించి తాను మాట్లాడినట్లు సమావేశంలో నేతలకు సుష్మా తెలిపారు. ఉగ్రశిబిరాలపై మెరుపుదాడులను ఈ సమావేశంలో అందరూ స్వాగతించారు.ఉగ్రవాదులను ఏరిపారేయడంలో భారత ప్రభుత్వానికి అన్ని పార్టీలు తమ మద్దతు తెలిపాయి. అఖిలపక్ష సమావేశం తర్వాత కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. మన బలగాలు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
Also Read : సుష్మా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం: వైమానిక దాడులపై వివరణ

ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి వారికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే..ప్రత్యేకంగా ఉగ్రవాదులను,ఉగ్రశిబిరాలను లక్ష్యంగా జరిగిన ఒక క్లీన్ ఆపరేషన్ ఇది అని ఆజాద్ అన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ లో అందరూ ఒకే మాటపై నిలబడి,భధ్రతా బలగాలను పొగడ్తలతో ముంచెత్తడం, ఉగ్రవాదుల ఏరివేతలో ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పడం తనకు చాలా సంతోషం కలిగించిందని సుష్మాస్వరాజ్ తెలిపారు.

Also Read : బుద్ధిమారదు అంతే : పాకిస్థాన్ కు చిల్లిగవ్వ ఇచ్చేదిలేదు

ట్రెండింగ్ వార్తలు