ఎవరైనా లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే.. మీ నుదిటిపై ఇలానే స్టాంప్ వేస్తారు!

  • Publish Date - March 27, 2020 / 10:35 AM IST

కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. 21 రోజుల పాటు కొనసాగనున్న లాక్ డౌన్ ను చాలామంది ఉల్లంఘిస్తున్నారు. అవసరం లేకపోయినప్పటికీ రోడ్లపైకి వచ్చి లాక్ డౌన్ నిబంధలను ఉల్లంఘిస్తున్నారు. రోడ్లపై తిరగొద్దని ఇంటిపట్టునే ఉండాలని పోలీసులు, ప్రభుత్వాలు సూచిస్తున్నప్పటికీ కొందరు ఆకతాయిలు పట్టించుకోకుండా అలానే వచ్చేస్తున్నారు.

కొన్నిచోట్ల పోలీసులు రోడ్లపై వచ్చినవారిపై లాఠీలు విరిగేదాక కొడుతున్నారు. గుంజీలు తీయిస్తున్నారు. కప్పగంతులు కూడా వేయిస్తున్నారు. దయచేసి రోడ్లమీదకు రావద్దు అని పోలీసులు దండం పెడతామని బుద్ధిగా చెప్పినా వినడం లేదు. లాక్ డౌన్ ఉల్లంఘించినవారిపట్ల పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారు.

అయినప్పటికీ చాలామందిలో మార్పు రావడం లేదు. రోడ్లపై తిరిగేస్తున్నారు. ఇలా చెప్తే వినే పరిస్థితుల్లో లేరని జమ్మూ కశ్మీర్ లోని రణ్ బీర్ సింగ్ పురా పోలీసులు వినూత్నంగా ఆకతాయిలను శిక్షించారు. రోడ్లపైకి వచ్చి లాక్ డౌన్ నిబంధలను ఉల్లంఘించినందుకు వారి నుదిటిపై లాక్ డౌన్ ఉల్లంఘన ముద్ర వేస్తున్నారు. కొందరి చేతులకు కూడా ఇదే రకమైన స్టాంపులను వేస్తున్నారు.

ఆయా స్టాంపులపై లాక్ డౌన్ ఉల్లంఘనలు, పోలీసు స్టేషన్ పేరు రాసి ఉన్నాయి. ఇలా వేసిన స్టాంపులు 15 రోజుల పాటు అలానే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇలా శిక్షించాక అయినా ఆకతాయిలు తీరు మార్చుకుని రోడ్లుమీదకు రాకుండా ఉంటే మంచిదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో కరోనా 13 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు పిల్లలకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం సోకిన వారి సంఖ్య 13కి చేరింది. ప్రభుత్వ ప్రతినిధి రోహిత్ కన్సల్ ట్వీట్ చేస్తూ.. ‘శ్రీనగర్‌లో కరోనా వైరస్‌తో మరో రెండు కేసులు నమోదయ్యాయి.

ఇద్దరూ అక్కాచెల్లల్లకు (ఒకరు 7 సంవత్సరాలు, మరొకరు 8 నెలల వయస్సు).కు వైరస్ సోకినట్టు నిర్ధారించినట్టు తెలిపారు. కరోనా వైరస్ సోకిన 11 మంది రాష్ట్రంలో చికిత్స పొందుతున్నారు. సౌదీ అరేబియాకు వెళ్లొచ్చిన వ్యక్తికి మంగళవారం శ్రీనగర్‌లో కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించినట్టు అధికారులు తెలిపారు.

అతడికి ఇద్దరు పిల్లలతోపాటు అతని మనవరాళ్లు అని కన్సల్ చెప్పారు. ఈ రెండు కేసులతో, లోయలో కరోనా సోకిన వారి సంఖ్య పదికి పెరిగిందని, మొత్తం యూనియన్ భూభాగంలో 13 కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. గురువారం ఉదయం ఆసుపత్రిలో ఒకరు మరణించగా, ఒకరు డిశ్చార్చి అయినట్టు కన్సల్ వెల్లడించారు.