ఉల్లి దారిలోనే.. టమోటా: కేజీ @60

ఆకాశన్నింటింది ఉల్లి ధరలే కాదు.. టమోటాలు కూడా. ఉల్లి ధరలు పెరిగి దొంగతనాలు చేయడానికి కూడా సిద్ధమవుతుంటే ఇప్పుడు టమోటా రేటు కూడా పీక్స్‌కు చేరుకుని సామాన్యుడిని అందమంటూ వెక్కిరిస్తున్నాయి. ఈ రేటు దేశ రాజధాని ఢిల్లీలో 70శాతం పెరిగింది. అంటే దాదాపు కేజీ టమోటా ధర రూ.60కి చేరుకుంది. 

టమోటా పెరిగింది ఢిల్లీ నగరంలో మాత్రమే కాదు. దేశ వ్యాప్తంగా కేజీ 40-60కి మధ్యలో అమ్ముతున్నారు. ఒక్కసారిగా 30రూపాయలుగా ఉన్న టమోటా రేటు 60రూపాయలకు పెరగడంతో వినియోగదారులు కొనడానికి భయపెడుతున్నారు. బుధవారం నాటికి ఉల్లిపాయ ధర రూ.52 ఉన్న సమయంలో టమోటా రేటు పెరగడంతో మార్కెట్‌కు వెళ్లి ఖాళీ చేతుల్తో తిరిగొస్తున్నారు. 

గురువారం ఢిల్లీ హోల్ సేట్ మార్కెట్లో 25కేజీల టమోటాలు రూ.800 ధర పలికాయి. యావరేజ్ పంట పండిన టమోటాలు రూ.500గా ఉన్నాయి. టమోటా ఇంతేకాదని టమోటా రేట్లు ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయని ఆజాద్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక వరదల కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిని ధరలు ఆకాశానికి చేరాయి.