Reduction of cooking oil : భారీగా తగ్గుతున్న వంటనూనె ధరలు..!

రష్యా- యుక్రెయిన్ యుద్ధం ప్రారంభించినప్పటింనుంచి అక్కడినుంచి భారత్ కు వచ్చే వంటనూనెల సరఫరా నిలిచిపోయింది. దీంతో భారత్ లో వంటనూనెల ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పుడు యుక్రెయిన్ నుంచి నూనెల సరఫరా ప్రారంభం కావడంతో భారత్‌లో సన్‌ఫ్లవర్, సోయాబీన్ ముడి నూనెల ధరలు భారీగా తగ్గాయి.

Reduction of cooking oil : సామాన్యులకు శుభవార్త. వంటనూనెల ధరలు భారీగా తగ్గుతున్నాయి. యుక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటనుంచి వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. దీంతో సామాన్యులకు ఆర్థిక భారం పెరిగింది. కానీ రష్యా-యుక్రెయిన్ వార్ కొనసాగుతున్నప్పటికీ యుక్రెయిన్ మాత్రం వంటనూనెల సరఫరాను తిరిగి ప్రారంభించింది.దీంతో భారత్ లో వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇది సామన్యులకు ఊరట అని చెప్పాల్సిందే.

రష్యా- యుక్రెయిన్ యుద్ధం ప్రారంభించినప్పటింనుంచి అక్కడినుంచి భారత్ కు వచ్చే వంటనూనెల సరఫరా నిలిచిపోయింది. దీంతో భారత్ లో వంటనూనెల ధరలకు రెక్కలొచ్చాయి. భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు యుక్రెయిన్ నుంచి నూనెల సరఫరా ప్రారంభం కావడంతో భారత్‌లో సన్‌ఫ్లవర్, సోయాబీన్ ముడి నూనెల ధరలు భారీగా తగ్గాయి. 2022తో పోలిస్తే ధరలు 46 నుంచి 57 శాతం వరకు తగ్గాయి. ఈ తగ్గుదల రిటైల్ మార్కెట్లో మాత్రం 16-17 శాతంగానే ఉండనుంది.

కాగా యుక్రెయిన్ లో సన్ ఫ్లవర్ పంటలకు ప్రిసిద్ది చెందింది.సన్ ఫ్లవర్ పంటలను భారీగా పండిస్తుంది యుక్రెయిన్. కానీ రష్యా యుక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించినప్పటినుంచి ఈ సరఫరా నిలిచిపోయింది. యుక్రెయిన్ పై క్షిపణిలతో ఈనాటికి రష్యా విరుచుకుపడుతునే ఉంది.వేలాదిమంది ప్రాణాలు తీస్తునే ఉంది. ఇటుయుక్రెయిన్, అటు రష్యా సేన ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా దాడులకు యుక్రెయిన్ శ్మశానంలా మారిపోయింది. ఎక్కడ చూసిన శిథిల భవనాలే కనిపిస్తున్నాయి. లక్షలాదిమంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పక్కదేశాలకు వలసపోయిరు యుక్రెయిన్ ప్రజలు. ఈక్రమంలో రష్యా యుద్ధానికి ముగింపు పలికేలా వాతావరణం ఎక్కడా కనిపించటంలేదు. ఈక్రమంలో ఓ పక్క శక్తివంతమైన రష్యాను ఎదుర్కొంటునే మరో పక్క తమ ఉత్పత్తుల సరఫరాలను ముఖ్యంగా యుక్రెయిన్ కు ప్రత్యేకమైన సన్ ఫ్లవర్ వంటనూనెల సరఫరాను తిరిగి ప్రారంభించటంతో భారత్ లో వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి.

యుక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకునే ముడి సన్‌ఫ్లవర్ నూనె ధర.. సోయాబీన్, పామాయిల్ ధరల కంటే తక్కువగా ఉన్నట్టు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏఐ) తెక్కలు చెబుతున్నాయి. ముంబైలో ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర టన్నుకు ప్రస్తుతం రూ. 81,300గా ఉండగా, టన్ను ముడి పామాయిల్ ధర రూ. 82 వేలుగా ఉంది. సోయాబీన్ ఆయిల్ ధర రూ. 85,400గా ఉంది.

సంవత్సం క్రితం ముడి పామాయిల్, సోయాబీన్ ధరల కంటే సన్‌ఫ్లవర్ నూనె ధరే ఎక్కువగా ఉండేది. అంటే రూ.107 లక్షలుగా ఉండేది. ఈక్రమంలో యుక్రెయిన్ నుంచి ముడి నూనెల సరఫరా ప్రారంభమైందని, సన్‌ఫ్లవర్ నూనె దిగుమతి అధికరంగా ఉందని SEAI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా తెలిపారు. కానీ రిటైల్ మార్కెట్లో తగ్గిన ధరలు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాస్త సమయం పట్టినా ధరలు మాత్రం తగ్గనున్నాయి.

 

 

ట్రెండింగ్ వార్తలు