Agni Prime: అగ్ని ప్రైమ్ కొత్త తర ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతం

డీఆర్‌డీఓ ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో వివరాలు తెలిపింది.

Agni Prime: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO) అభివృద్ధి చేసిన అగ్ని ప్రైమ్ కొత్త తర ఖండాంతర క్షిపణి పరీక్షను భారత్‌ విజయవంతంగా పూర్తి చేసింది. గత రాత్రి 7.30 గంటలకు ఒడిశా (Odisha) తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం (APJ Abdul Kalam Island ) నుంచి దీన్ని పరీక్షించారు.

ఈ సమయంలో భారత్ అగ్ని ప్రైమ్ పరీక్ష చేపట్టడం ఇదే తొలిసారి. డీఆర్‌డీఓ ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో వివరాలు తెలిపింది. ఇప్పటికే పలుసార్లు అగ్ని శ్రేణి క్షిపణులను భారత్ పరీక్షించిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి నిర్వహించిన ప్రయోగంలో క్షిపణి వెళ్లగలినంత గరిష్ఠ దూరం వెళ్లింది.

అలాగే, అది లక్ష్యాలను కచ్చితత్వంతో, సమర్థంగా ఛేదించింది. అగ్ని ప్రైమ్ కొత్త తర ఖండాంతర క్షిపణి లక్ష్యాన్ని ఛేదించిన వేగం, తీరును రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్, టెలీమెట్రీ వ్యవస్థల సాయంతో నమోదు చేశారు. ఇంతకు ముందు మూడు సార్లు కొత్త తర అగ్ని ప్రైమ్ క్షిపణి పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.

అవి కూడా విజయవంతమయ్యాయి. కాగా, వాటిలో ఒక పరీక్ష ఈ ఏడాది జూన్ లో, మరొకటి గత ఏడాది డిసెంబరులో చేపట్టారు. ఆర్మీకి ఈ క్షిపణిని అందించవచ్చని తాజా ప్రయోగం ద్వారా తేల్చామని అధికారులు చెప్పారు.

Monsoon arrives in Kerala:నైరుతి రుతుపవనాలు కేరళకు వచ్చేశాయ్…ఐఎండీ శాస్త్రవేత్తల చల్లటి కబురు

ట్రెండింగ్ వార్తలు