Monsoon arrives in Kerala:నైరుతి రుతుపవనాలు కేరళకు వచ్చేశాయ్…ఐఎండీ శాస్త్రవేత్తల చల్లటి కబురు

భారత వాతావరణశాఖ గురువారం ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. ‘‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...చెట్టు నీడకై పరుగిడుతుంటే...కారు మబ్బులు కమ్ముతు ఉంటే’’ చెప్పలేని ఆ హాయి అంటూ ప్రజలు రుతుపవనాల ఆగమనంతో పాటలు పాడుకుంటున్నారు....

Monsoon arrives in Kerala:నైరుతి రుతుపవనాలు కేరళకు వచ్చేశాయ్…ఐఎండీ శాస్త్రవేత్తల  చల్లటి కబురు

Monsoon arrives in Kerala

Monsoon arrives in Kerala: భారత వాతావరణశాఖ గురువారం ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. ఎండలతో మండిపోతున్న ప్రజలకు ఆహ్లాదాన్ని నింపేలా నైరుతి పవనాలు గురువారం కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించాయి.(conditions favorable for rains)నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం కొన్ని ప్రాంతాలు, మొత్తం లక్షద్వీప్ ప్రాంతం, కేరళలోని చాలా ప్రాంతాలు, దక్షిణ తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, కొమోరిన్ ప్రాంతంలోని మిగిలిన ప్రాంతాలు, గల్ఫ్ ఆఫ్ మన్నార్, మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. ‘‘చిటపట చినుకులు పడుతూ ఉంటే…చెట్టు నీడకై పరుగిడుతుంటే…కారు మబ్బులు కమ్ముతు ఉంటే’’ చెప్పలేని ఆ హాయి అంటూ ప్రజలు రుతుపవనాల ఆగమనంతో పాటలు పాడుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళలో ప్రవేశించాయి.

Biparjoy Very Severe Cyclone: పలు రాష్ట్రాల్లో ఈ నెల 12వతేదీ వరకు భారీవర్షాలు

రాగల 48 గంటల్లో కేరళ అంతటా , తమిళనాడు, కర్ణాటక లోని కొన్ని భాగాలకు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి.దీంతో వేసవి తాపం నుంచి ప్రజలకు ఒకింత ఊరట లభించినట్లయింది.ఏడు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. గత 24 గంటల్లో ఆగ్నేయ అరేబియా సముద్రంలో మేఘాలు పెరిగాయి. గడచిన 24 గంటల్లో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలోకి రుతుపవనాలు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఎల్‌నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పటికీ, భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.రుతుపవనాలు భారతదేశ వ్యవసాయానికి కీలకం. 52 శాతం నికర సాగు విస్తీర్ణం వర్షాలపై ఆధారపడి ఉంది. దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తితోపాటు తాగునీటికి కీలకమైన రిజర్వాయర్లను నింపడానికి కూడా వర్షాలే కీలకం.

Cyclone Biparjoy: బిపర్‌జోయ్ తుపాన్ మరింత తీవ్రం..ఐఎండీ హెచ్చరిక

ఉత్తర చత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉన్న ద్రోణి గురువారం బలహీన పడింది.దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య, పశ్చిమ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయని వాతావరణశాఖ హైదరాబాద్ సంచాలకులు చెప్పారు.నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళలో ప్రవేశించాయి. రాగల 48 గంటల్లో కేరళ అంతటా , తమిళనాడు, కర్ణాటక లోని కొన్ని భాగాలకు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు, రేపు అక్కడక్కడ, ఎల్లుండి కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

No plans to withdraw Rs 500 notes: రూ.500నోట్లపై రిజర్వు బ్యాంక్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

గురువారం, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు , మెరుపులు,ఈదురు గాలులుతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. గాలి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని ఐఎండీ అధికారులు చెప్పారు. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది.ఈ రోజు, రేపు ఖమ్మం నల్గొండ, సూర్యాపేట , కొత్తగూడెం, అదిలాబాద్, కొమరం భీం , మంచిర్యాల్, నిర్మల్ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఎండీ అధికారులు వివరించారు.