Cyclone Biparjoy: బిపర్‌జోయ్ తుపాన్ మరింత తీవ్రం.. ఐఎండీ హెచ్చరిక

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) గురువారం వెల్లడించింది. ఈ తుపాన్ ప్రభావం వల్ల కేరళలో రేపు రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూలమైన పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణశాఖ తెలిపింది....

Cyclone Biparjoy: బిపర్‌జోయ్ తుపాన్ మరింత తీవ్రం.. ఐఎండీ హెచ్చరిక

Biparjoy Very Severe Cyclonic Storm

Biparjoy Very Severe Cyclonic: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) గురువారం వెల్లడించింది. ఈ తుపాన్ ప్రభావం వల్ల కేరళలో రేపు రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూలమైన పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణశాఖ తెలిపింది. అత్యంత తీవ్రమైన తుపాన్ మరింత బలపడి రానున్న మూడు రోజుల్లో ఉత్తర దిశగా కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Wrestlers Protest: 5 గంటలు కేంద్ర మంత్రితో చర్చించి.. కీలక ప్రకటన చేసిన రెజ్లర్లు

భారతదేశం, ఒమన్, ఇరాన్, పాకిస్తాన్‌తో సహా అరేబియా సముద్రాన్ని ఆనుకుని ఉన్న దేశాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది ఇంకా అంచనా వేయలేదు. జూన్ 12వతేదీ వరకు తుపాన్ తీవ్రత పెరుగుతోందని శాస్త్రవేత్తలు చెప్పారు. వాతావరణ మార్పుల కారణంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో తుపాన్లు బలపడుతున్నాయని వారు తెలిపారు.

Gangster Sanjeev Jeeva: యూపీలో మరో దారుణం.. కోర్టు వెలుపలే గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవా హత్య

బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుపాను, అల్పపీడనం ప్రభావంతో దక్షిణ ద్వీపకల్పంలో వర్షాలు కురుస్తాయని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త తెలిపారు.తుఫాను తీవ్రత క్షీణించిన తర్వాత దక్షిణ ద్వీపకల్పం దాటి రుతుపవనాల పురోగతి సాగుతుందని ఐఎండీ తెలిపింది.