Gangster Sanjeev Jeeva: యూపీలో మరో దారుణం.. కోర్టు వెలుపలే గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవా హత్య
కాంపౌండర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సంజీవ్ జీవా చివరికి అండర్ వరల్డ్‌లో మునిగిపోయాడు. బాగ్‌పత్ జైలులో శిక్ష అనుభవిస్తూ 2018లో హత్యకు గురైన మున్నా బజరంగీకి కూడా సంజీవ్ సన్నిహితుడని అంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ మధ్య తరుచూ ఇలాంటి దాడులు జరుగుతున్నాయి.

Uttar Pradesh: కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ సహా అతడి సోదరుడిని పోలీసులు, మీడియా సమక్షంలో గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చిన ఘటన దేశంలో కలకలం సృష్టించింది. ఆ తరహాలోనే ఆ రాష్ట్రంలో మరో హత్య జరిగింది. ఏకంగా రాజధాని లఖ్‌నవూ కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవాను దుండగులు కాల్చి చంపారు. ఇక ఈ దాడిలో ఒక యువతి గాయపడింది. గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ సన్నిహితుడు అయిన సంజీవ్ మహేశ్వరి జీవా.. బీజేపీ ఎమ్మెల్యే బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో సహ నిందితుడు. కాగా, ఈ కేసులో ముఖ్తార్ అన్సారీ కూడా నిందితుడే.
Sandstorm: రాజస్థాన్‌లో 80 అడుగుల ఎత్తులో భయంకరమైన ఇసుక తుఫాను
క్రిమినల్ కేసులో విచారణ నిమిత్తం జీవాను లక్నో కోర్టుకు తీసుకొచ్చారు. లాయర్ల వేషంలో కోర్టుకు వచ్చిన షూటర్లు.. సంజీవ్ జీవాపై కాల్పులు జరిపారని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌గా పేరున్న సంజీవ్ జీవాను చంపిన అనంతరం, దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిలో ఒక పోలీసు కానిస్టేబుల్‌కు కూడా గాయాలు అయ్యాయని, అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.