Biparjoy Very Severe Cyclone: పలు రాష్ట్రాల్లో ఈ నెల 12వతేదీ వరకు భారీవర్షాలు
బిపర్‌జోయ్ తుపాన్ ప్రభావం వల్ల కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో గాలులతో పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ గురువారం వెల్లడించింది. ఈ తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని దీని ప్రభావం వల్ల సముద్ర తీర ప్రాంతాల్లో భారీ గాలులు వీస్తాయని....

Cyclon Efect Heavy Rains
Biparjoy Cyclon Efect Heavy Rains: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాన్ ప్రభావం వల్ల కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో గాలులతో పాటు భారీవర్షాలు(Heavy Rains) కురుస్తాయని భారత వాతావరణశాఖ గురువారం వెల్లడించింది. బిపర్‌జోయ్ తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని(severe cyclonic storm) దీని ప్రభావం వల్ల సముద్ర తీర ప్రాంతాల్లో భారీ గాలులు వీస్తాయని ఐఎండీ శాస్త్రవేత్తలు చెప్పారు.రుతుపవనాలు శుక్రవారం కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ తెలిపింది.
Woman live in relationship:థానేలో దారుణం.. ప్రియుడితో సహజీవనం చేస్తున్న మహిళను చంపి..ముక్కలుగా కోసి…
ఈ తుపాన్ ప్రభావం వల్ల కేరళలోని కొంకణ్ తీరం, కర్ణాటక, (Coastal Karnataka, Kerala)గోవా రాష్ట్రాల్లో ఈ నెల 12వతేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొంది. తుపాన్ తీవ్రత దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. కర్ణాటక రాష్ట్రంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు.
తుపాన్ ప్రభావం వల్ల కేరళలో ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కేరళలో తేలికపాటి రుతుపవనాలు ప్రారంభమవుతాయని వాతావరణ సంస్థ వెల్లడించింది.ఎర్నాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గురువారం జిల్లాకు వర్ష హెచ్చరిక జారీ చేశారు.దీంతోపాటు శుక్రవారం తిరువనంతపురం, కొల్లాం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Cyclone Biparjoy: బిపర్‌జోయ్ తుపాన్ మరింత తీవ్రం..ఐఎండీ హెచ్చరిక
అరేబియా సముద్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలకు మత్స్యకారులు వెళ్లకూడదని ఐఎండీ కోరింది.కేరళలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వచ్చే 48 గంటల్లో కేరళలో రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గురు, శుక్రవారాల్లో అరియలూరు, కడలూరు, తంజావూరు, తిరువారూర్, నామక్కల్, పుదుకోట్టై, మరికొన్ని ప్రాంతాల్లో వర్షం,ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.
VSCS BIPARJOY over eastcentral Arabian Sea, lay centered at 2330hrs IST of 07 Jun, 2023 near lat 13.6N & long 66.0E, about 870km west-southwest of Goa, 930km sw of Mumbai. It would intensify further gradually during next 48hrs & move nearly north-northwestwards during next 3days. pic.twitter.com/jbiLB41Ou8
— India Meteorological Department (@Indiametdept) June 7, 2023