Madhya Pradesh Woman Elopes: ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌తో కలిసి కేరళ స్టోరీ సినిమా చూసిన యువతి మళ్లీ పారిపోయింది…
మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్‌తో కలిసి ది కేరళ స్టోరీ సినిమా చూసిన కొన్ని రోజుల తర్వాత భోపాల్‌లో 20 ఏళ్ల యువతి మళ్లీ ఇంటి నుంచి పారిపోయింది.ముస్లిం ప్రియుడితో కలిసి పారిపోయిందని యువతి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.....

Kerala Story With Pragya Thakur
Madhya Pradesh Woman Elopes: మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్‌తో కలిసి ది కేరళ స్టోరీ సినిమా చూసిన మూడు రోజుల తర్వాత భోపాల్‌లో 20 ఏళ్ల యువతి మళ్లీ ఇంటి నుంచి పారిపోయింది. నేర చరిత్ర ఉన్న తన ముస్లిం ప్రియుడితో కలిసి పారిపోయిందని యువతి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. రూ.70 వేల నగదు, నగలు ఎత్తుకెళ్లినట్లు ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా అదే సమయంలో ఇంటి నుంచి పారిపోయిన యువతి ఒక వీడియోను విడుదల చేసింది. తాను పెద్దదానినని తాను ఏమి చేయాలో తనకు తెలుసునని పారిపోయిన యువతి వీడియోలో పేర్కొంది.
Cyclone Biparjoy: బిపర్‌జోయ్ తుపాన్ మరింత తీవ్రం..ఐఎండీ హెచ్చరిక
ఇంతకుముందు కూడా మే 11 వతేదీన ఈ యువతి పారిపోయింది. దీంతో యువతి కుటుంబం ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ సహాయం కోరింది. చివరకు పోలీసుల సహాయంతో యువతి తిరిగి ఇంటికి వచ్చింది. ప్రగ్యా సింగ్ ఠాకూర్ యువతిని ది కేరళ స్టోరీ సినిమా చూడటానికి తనతో తీసుకెళ్లింది. ముస్లిం పురుషులు కేరళలో హిందూ యువతులను తీవ్రవాదంలోకి దించి, ఇస్లాం మతంలోకి మార్చారని ఆరోపించిన వివాదాస్పద చిత్రాన్ని ఎంపీ యువతికి చూపించింది.నర్సింగ్ స్కూల్‌లో తన క్లాస్‌మేట్ అయిన అతని సోదరి ద్వారా ఆ యువతికి యూసుఫ్ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది.
Austrian Train Fire Breaks Out: ఆస్ట్రియన్ రైలులో చెలరేగిన మంటలు..45 మంది ప్రయాణికులకు గాయాలు
ఆ యువకుడు స్కూల్ డ్రాపౌట్, స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతనిపై పలు కేసులున్నాయి. యూసుఫ్ ఖాన్ దాడి, దొంగతనం, దహనం వంటి నేరాలు చేశాడు.పిండి మిల్లు నడుపుతున్న యూసుఫ్ ఖాన్ తండ్రి.. తన కొడుకును ఇంటి నుంచి గెంటేశాడని సమాచారం.యువతి కనిపించకుండా పోయిందని కేసు నమోదు చేశామని స్థానిక పోలీసు సీనియర్ అధికారి అనిల్ బాజ్‌పాయ్ చెప్పారు. తాము సాధ్యమైన అన్ని మార్గాల ద్వారా యువతిని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.