Austrian Train Fire Breaks Out: ఆస్ట్రియన్ రైలులో చెలరేగిన మంటలు..45 మంది ప్రయాణికులకు గాయాలు

బాలాసోర్ రైలు ప్రమాదం ఘటన మరవక ముందే ఆస్ట్రియన్ దేశంలోని రైలులో మంటలు అంటుకున్నాయి. ఆస్ట్రియన్ దేశంలో ప్రయాణికుల రైలులో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల రైలు సొరంగమార్గంలో వెళుతుండగా దెబ్బతిన్న కేబుల్ నుంచి మంటలు అంటుకున్నాయి.

Austrian Train Fire Breaks Out: ఆస్ట్రియన్ రైలులో చెలరేగిన మంటలు..45 మంది ప్రయాణికులకు గాయాలు

Austrian Train Fire Breaks Out

Austrian Train Fire Breaks Out: ఆస్ట్రియన్ దేశంలో ప్రయాణికుల రైలులో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల రైలు సొరంగమార్గంలో వెళుతుండగా దెబ్బతిన్న కేబుల్ నుంచి మంటలు అంటుకున్నాయి.హాంబర్గ్- ఆమ్‌స్టర్‌డామ్‌లకు వెళ్లే రైలు ఆస్ట్రియన్ ఆల్ప్స్‌లోని ఇన్స్‌బ్రక్ నగరానికి దగ్గరగా ఉన్న సొరంగం గుండా(Austrian tunnel) వెళుతుండగా, దాని ఓవర్‌హెడ్ వైర్ తెగిపడి మంటలు అంటుకున్నాయని ఆస్ట్రియన్ రైలు ఆపరేటర్ చెప్పారు.

Cyclone Biparjoy: బిపర్‌జోయ్ తుపాన్ మరింత తీవ్రం..ఐఎండీ హెచ్చరిక

ఈ ఘటనలో 45 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని, పొగ పీల్చడం వల్ల కావచ్చునని స్థానిక పోలీసులు తెలిపారు. అనంతరం రైలులో మంటలు చెలరేగడంతో రైలులో ఉన్న 200 మంది ప్రయాణికులను ఖాళీ చేయించినట్లు(200 passengers evacuated) ఆ దేశ రైల్వే అధికారులు తెలిపారు.పశ్చిమ ఆస్ట్రియాలోని ఫ్రిట్జెన్స్‌లోని టెర్ఫెనర్ టన్నెల్ వద్దకు అగ్నిమాపక దళ సభ్యులు హుటాహుటిన తరలివచ్చారు.అగ్నిమాపక దళ సభ్యులు రైలులో మంటలను ఆర్పివేశారు.

Bhubaneswar : ఒడిశా రైల్వే ట్రాక్‌పై ప్రేమ లేఖలు, బొమ్మలు .. కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు

రైలులో మంటలకు కారణమేమిటి అన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణీకులను తీసుకువెళుతున్న రైలులో ఆటోమొబైల్స్‌ను కూడా రవాణా చేస్తుండగా, వాటిలో దెబ్బతిన్న కేబుల్ నుంచి మంటలు అంటుకున్నాయని రైల్వే ప్రతినిధి తెలిపారు.ఈ రైలు బుధవారం సాయంత్రం వియన్నా నుంచి బయలుదేరింది. గురువారం ఉదయం ఆమ్‌స్టర్‌డామ్ చేరుకోవాల్సి ఉండగా అగ్నిప్రమాదంతో టన్నెల్ వద్ద నిలిపివేసి ప్రయాణికులను దించారు.