Bhubaneswar : ఒడిశా రైల్వే ట్రాక్‌పై ప్రేమ లేఖలు, బొమ్మలు .. కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు

'చిన్న మేఘాలు వర్షం కురిపిస్తాయి.. చిన్న కథలు ప్రేమనిస్తాయి'.. ఒడిశా రైలు ట్రాక్‌పై విషాదానికి సాక్ష్యంగా మిగిలిన ప్రేమ కవితలు.. చిట్టి చేతులు ఆడుకున్న బొమ్మలు కన్నీరు పెట్టిస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ కనిపిస్తున్న విషాద దృశ్యాలు చూపరులను కంట తడిపెట్టిస్తున్నాయి.

Bhubaneswar : ఒడిశా రైల్వే ట్రాక్‌పై ప్రేమ లేఖలు, బొమ్మలు .. కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు

Bhubaneswar

Bhubaneswar : ఏ రచయిత కలం నుంచి పుట్టుకొచ్చిన కవితలో అవి.. ఏ చిన్ని తల్లి చేతులు ఆడుకున్న బొమ్మలో అవి.. రైల్వే ట్రాక్‌పై విషాదానికి గుర్తుగా కనిపిస్తున్నాయి. మరణించిన వారి జ్ఞాపకాల్ని గుర్తు చేస్తున్నాయి. ఒడిశా రైలు ప్రమాదంలో ట్రాక్ మీద కనిపిస్తున్న వస్తువులు గుండెల్ని పిండేస్తున్నాయి.

Balasore train crash : ఒడిశా ప్రజలు 1000మంది ప్రాణాలు కాపాడారు…సీఎం నవీన్ పట్నాయక్ ప్రశంసలు

ఒడిశా ఘోర రైలు ప్రమాదం దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఇప్పటికీ ఈ ఘటనలో 296 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. 1000 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన తమవారిని చూసి కొన్ని గుండెలు పగిలిపోయాయి. ఇప్పటికీ ఆచూకీ తెలియని వారి కోసం కొన్ని గుండెలు అల్లాడుతున్నాయి. చికిత్స పొందుతున్నవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారి కుటుంబసభ్యుల ఆందోళన వర్ణనాతీతం. ఓవైపు ప్రమాద స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

 

రైలు పట్టాలపై చెల్లాచెదురైన మృతదేహాల శరీర భాగాల్ని బయటకు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది భద్రంగా దాచుకున్న పుస్తకాలు, బొమ్మలు బయటపడటం చూస్తుంటే కన్నీరు తెప్పిస్తున్నాయి. ఒకరు బెంగాలీలో రాసుకున్న ప్రేమలేఖ కనిపించింది. ‘చిన్న మేఘాలు వర్షం కురిపిస్తాయని.. చిన్న కథలు ప్రేమనిస్తాయని’ రాసుకున్నారు. ఆ కవిత రాసుకున్న నోట్ బుక్ ఎవరిదో తెలీదు.. ఆ కవిత రాసిన రచయిత పేరు తెలీదు.. ఆ కవిత ఎవరి కోసం రాసుకున్నారో తెలియదు. అసలు రాసుకున్న వ్యక్తి సజీవంగా ఉన్నారో లేదో కూడా తెలియదు.

South Central Railway: ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో.. 9వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు

 

కొందరి చెప్పులు, సూట్‌కేసులు, బ్యాగులు గుట్టలుగా పడి ఉన్నాయి. బట్టలు చిరిగిపోయి రక్తం కారింది. పిల్లలు స్కెచ్ పెన్నులతో గీసుకున్న బొమ్మలు, చేతులు విరిగిపోయిన బొమ్మలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఒడిశా రైల్వే ట్రాక్ చూస్తే గుండె బరువెక్కిపోతోంది. మరోవైపు ప్రమాదానికి గల కారణాలేంటో ఇంకా అధికారులు తేల్చి చెప్పలేదు.