Woman live in relationship:థానేలో దారుణం.. ప్రియుడితో సహజీవనం చేస్తున్న మహిళను చంపి..ముక్కలుగా కోసి…
ముంబయి నగర పరిధిలోని థానేలో మరో దారుణం వెలుగుచూసింది. ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్యోదంతం మరవక ముందే అదే తరహాలో ముంబయి వ్యక్తి తన జీవిత భాగస్వామిని చంపి ముక్కలు కోసం కుక్కరులో వేసి వండాడు...

Mumbai police
Woman live in relationship: ఢిల్లీలో తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలు శ్రద్ధావాకర్ ను దారుణంగా హతమార్చి ముక్కలు కోసిన ఆప్తాబ్ పూనావాలా కేసు మరవక ముందే ముంబయి నగర పరిధిలోని థానేలో మరో దారుణం గురువారం వెలుగుచూసింది. ముంబయి పరిధిలోని థానే మీరా రోడ్‌లోని తన అద్దె అపార్ట్‌మెంట్‌లో 56 ఏళ్ల వ్యక్తి తన జీవిత భాగస్వామిని చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసిన ఘటన సంచలనం రేపింది.
నిందితుడు మనోజ్ సహాని అనే వ్యక్తి గత మూడేళ్లుగా గీతా నగర్ ఫేజ్ 7లోని గీతా ఆకాష్ దీప్ భవనంలోని 704 ఫ్లాట్ లో సరస్వతి వైద్య (36) అనే మహిళతో కలిసి జీవనం సాగించేవాడు. ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అరెస్టు చేయబడ్డాడు. మనోజ్ బోరివాలీలో చిన్న దుకాణం నడుపుతున్నాడు. మనోజ్ తన భాగస్వామి సరస్వతి మృతదేహాన్ని చెట్టు కట్టర్‌తో నరికి, ఆమె శరీర భాగాలను కుక్కర్‌లో ఉడకబెట్టాడని పోలీసులు చెప్పారు.
Austrian Train Fire Breaks Out: ఆస్ట్రియన్ రైలులో చెలరేగిన మంటలు..45 మంది ప్రయాణికులకు గాయాలు
మనోజ్ ఇంట్లో కుళ్లిపోయిన శరీర భాగాలను బట్టి హత్య మూడు-నాలుగు రోజుల క్రితమే జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కుళ్లిపోయిన మహిళ మృతదేహం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. హత్య వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.