Krishna Idol : విరిగిన కృష్ణుడి విగ్రహం చేయి.. కట్టు కట్టాలంటూ ఆసుపత్రికి తీసుకెళ్లిన పూజారి

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. శ్రీకృష్ణుడి విగ్రహానికి చేయి విరిగిపోవడంతో, దానికి కట్టు కట్టాలంటూ ఆలయ పూజారి ఆ విగ్రహాన్ని ఆసుపత్రికి తీసుకురావడం అందరినీ

Krishna Idol

Krishna Idol : మనిషికో, జంతువుకో గాయం అయితేనో, అనారోగ్యం చేస్తేనో డాక్టర్ దగ్గరికి వెళ్లడం కామన్. ప్రాణమున్న జీవి కాబట్టి డాక్టర్లు చికిత్స చేస్తారు. కానీ, ప్రాణం లేని విగ్రహానికి చికిత్స చేయాలని ఎవరైనా అడగటం ఎప్పుడైనా విన్నారా? విగ్రహానికి కట్టు కట్టాలని ఆసుపత్రికి తీసుకెళ్లడం ఎక్కడైనా చూశారా? కనీసం విన్నారా? విగ్రహానికి చికిత్స చేయమనడం ఏంటి? అని విస్తుపోతున్నారు కదూ.

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో అలాంటి విచిత్రమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. శ్రీకృష్ణుడి విగ్రహానికి చేయి విరిగిపోవడంతో, దానికి కట్టు కట్టాలంటూ ఆలయ పూజారి ఆ విగ్రహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అర్జున్ నగర్ లోని పఠ్వారీ ఆలయంలో ఉన్న బాలకృష్ణుడి విగ్రహం భక్తుల పూజలందుకుంటోంది. ఆ ఆలయంలో 30 ఏళ్లుగా లేఖ్ సింగ్ పూజారిగా వ్యవహరిస్తున్నాడు.

Invest Grow Your Wealth: ఈ సీక్రెట్ తెలిస్తే.. రూ.10లక్షల పెట్టుబడితో రూ.100 కోట్లు ఈజీగా సంపాదించొచ్చు..!

అయితే ఉదయం స్వామివారికి అభిషేకం చేయిస్తుండగా విగ్రహం పొరపాటున చేయిజారి కిందపడింది. దాంతో ఆ విగ్రహం చేయి విరిగింది. ఈ పరిణామంతో ఆ పూజారి తల్లడిల్లిపోయాడు. ఓ పసిబిడ్డను పొదివి పట్టుకున్నట్టుగా బాలకృష్ణుడి విగ్రహాన్ని అత్యంత జాగ్రత్తగా జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. విగ్రహానికి చేయి విరిగిందని, కట్టు కట్టాలని ఆసుపత్రి సిబ్బందిని కోరాడు. పూజారి అలా అడగడంతో ఆసుపత్రి సిబ్బంది కంగుతిన్నారు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. తాము విన్నది నిజమేనా అని విస్మయానికి లోనయ్యారు.

Chandrababu: శపథాలు చేశారు.. సీఎంలు అయ్యారు.. జయలలిత, జగన్ తర్వాతెవరు..?

చేయి విరిగిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాలకృష్ణుడితో తనకు ఎంతో అనుబంధం ఉందని పూజారి లేఖ్ సింగ్ ఆసుపత్రి సిబ్బందికి తెలిపాడు. దయచేసి విగ్రహానికి చికిత్స చేయాలని విజ్ఞప్తి చేశాడు. దాంతో అతడికి సంతృప్తి కలిగించేందుకు ఆ ఆసుపత్రి సిబ్బంది విగ్రహానికి నిజంగానే కట్టు కట్టారు. అంతేకాదు ఆసుపత్రి రిజిస్టర్ లో పేషెంట్ పేరు ‘శ్రీ కృష్ణ’ అని నమోదు చేసుకోవడం విశేషం.